ఈదుతుంటే.. సముద్రం నీటిని శుద్ధి చేసే 3డి బికినీ
న్యూయార్క్: కాలిఫోర్నియా వర్సిటీ ఇంజినీర్లు కొత్త రకం బ్రా కనిపెట్టారు. తద్వారా టెక్నాలజీ ష్యాషన్ రంగాన్ని కూడా కొత్త పుంతలు తొక్కిస్తోందని మరోసారి రుజువు చేశారు. సముద్ర కలుషిత జలాలను శుద్ధి చేసే 3డి బికినీని అభివృద్ధి చేశారు.
కలుషిత జలాలను శుద్ధి చేసే విధంగా అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ఇంజినీర్లు స్పాంజ్‌సూట్ అనే 3డీ బికినిని రూపొందించారు. చక్కెర రూపంలో ఉండే సూక్రోజును వేడి చేసి దాంతో వచ్చిన పదార్థంతో చేసిన స్పాంజ్‌ను 3డీ ప్రింటెడ్ బికినీని రూపొందించినట్లు పరిశోధకులు తెలిపారు.
మురుగు, చమురుతో కలిసి ఉన్న సముద్ర నీటిని శుద్ధి చేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. సముద్ర బీచ్‌ల్లో విహారం చేసే సందర్శకులకు ఈ బికినీ ఉపశమనం కలిగిస్తుందని వర్సిటీ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ మిహ్రీ ఓజ్కాన్ తెలిపారు.

చమురు, రసాయన వ్యర్థ్యాలు, లవణపూరితమైన నీటిని శుద్ధి చేసే అప్లికేషన్లను గత నాలుగేళ్లుగా అభివృద్ధి చేస్తున్నామని వర్సిటీ పీహెచ్‌డీ పరిశోధకుడు డైసీ పాటినో తెలిపారు.
నీటిని వికర్షించే స్వభావమున్న మెటీరియల్‌ను సాధారణంగా విమానాలు, శాటిలైట్లు, మానవ రహిత అంతరిక్ష వాహనాల్లో ఉపయోగిస్తారని, అలాంటి మెటీరియల్‌ను ఫ్యాషన్ టెక్నాలజీలో ఉపయోగించేందుకు న్యూయార్క్, ఇస్తాంబుల్ నగరాలకు చెందిన కంపెనీలు ముందుకొచ్చాయన్నారు.
బికినీ బరువు కంటే ఇరవై అయిదు రెట్ల బరువును స్పాంజ్ గ్రహిస్తుందని, 1000 డిగ్రీల సెల్సియస్‌లో వేడి చేస్తే తప్ప అందులోని వ్యర్థాలు బయటకు రావని ఇంజినీర్లు పేర్కొన్నారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications