వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక చాలు.. ఉక్రెయిన్‌పై దాడి.. రష్యాకు ఐసీజే ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతోంది. ఈ దాడిని నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం రష్యాను ఆదేశించింది. రష్యా దురాక్రమణపై ఉక్రెయిన్‌ చేసిన ఫిర్యాదుపై నెదర్లాండ్స్‌ హేగ్‌లోని ప్రపంచ కోర్టు బుధవారం స్పష్టంచేసింది. ఐసీజే ఆదేశంపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో రష్యాపై తాము వేసిన కేసులో ఉక్రెయిన్‌ పూర్తి విజయాన్ని సాధించిందని తెలిపారు.

దురాక్రమణను వెంటనే నిలిపివేయాలని ఐసీజే ఆదేశించిందని చెప్పారు. అంతర్జాతీయ చట్టానికి లోబడి ఈ ఆదేశం ఉందన్నారు. రష్యా వెంటనే దీనికి కట్టుబడాలని సూచించారు. ఒకవేళ ఐసీజే ఆదేశాన్ని రష్యా విస్మరిస్తే ఆ దేశం మరింత ఏకాకి అవుతుందని హెచ్చరించారు. మరోవైపు రష్యా, ఉక్రెయిన్‌ మధ్య జరుతున్న చర్చల్లో కొంత పురోగతి కనిపించినట్లు తెలుస్తోంది.

 UN court orders Russia to cease hostilities in Ukraine

యుద్ధాన్ని ముగించడానికి ఇరు దేశాలు తాత్కాలిక శాంతి ప్రణాళికను రూపొందించాయని ది కైవ్ ఇండిపెండెంట్ అనే వార్తా సంస్థ తెలిపింది. నాటోలో సభ్యత్వాన్ని ఉక్రెయిన్‌ కోరకపోతే, స్విడన్‌ తరహాలో సైనిక దళాలపై పరిమితులకు ఆ దేశం అంగీకరిస్తే కాల్పులను విరమించడంతోపాటు ఉక్రెయిన్‌ నుంచి రష్యా దళాలను వెనక్కి మళ్లించడం వంటి ఒప్పందాలు ఈ శాంతి ప్రణాళికలో ఉన్నట్లు పేర్కొంది.

Recommended Video

Russia Ukraine Conflict : Ukraine - Russia అధ్యక్షులతో కీలక అంశాలపై PM Modi చర్చ! | Oneindia Telugu

ఇటు తగ్గేదే లేదని రష్యా అంటోంది. ఉక్రెయిన్‌పై యుద్దం కొనసాగుతోంది. కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటుంది. యుద్దం వల్ల గత వారం నుంచి ఇక్కడ నిత్యావసరాలు లేకుండా గడుపుతున్నారు. విద్యుత్, గ్యాస్, తాగేందుకు నీరు కూడా లేని పరిస్థితి నెలకొంది.శత్రువులు మారియుపోల్ యొక్క తూర్పు పొలిమేరను స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

English summary
United Nations' top court on Wednesday ordered Russia to stop hostilities in Ukraine granting measures requested by Kyiv, although many remain skeptical that Russia would comply.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X