13 ఏళ్ల బాలికలతో రూ.34లకు సెక్స్: ఐరాస ఆగ్రహం
మాలి: ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పని చేస్తున్న కొందరు కామాంధులుగా మారారని, ఐరాస వ్యవస్థలో ఓ క్యాన్సర్‌గా తయారయ్యారని సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఆవేదన వ్యక్తం చేశారు.
కొందరు సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ లో పదమూడేళ్ల చిన్నారులతో లైంగిక చర్యల కోసం సుమారు రూ.34 చెల్లిస్తున్నారని, ఇది అత్యంత సిగ్గు చేటన్నారు. గడచిన పద్నాలుగు నెలల్లో ఈ తరహా కేసులు 22 వరకూ వెలుగులోకి వచ్చాయని చెప్పారు.

ఈ తరహా నేరాలపై ఉపేక్షించేది లేదన్నారు. ఐక్యరాజ్య సమితి తరఫున ప్రస్తుతం ఆఫ్రికాలో తొమ్మిది శాంతి రక్షక దళాలు పని చేస్తున్నాయన్నారు. మాలి, సౌత్ సూడాన్, లైబీరియా, కాంగో దేశాల్లో తమ దళాల పైనే అత్యాచార, సెక్స్ రాకెట్ ఆరోపణలు రావడంతో తన మనసు విచారంతో నిండిపోయిందని బాన్ కీ మూన్ అన్నారు.
ఈ ఘటనలపై స్వతంత్ర దర్యాఫ్తును జరిపిస్తున్నామని అన్నారు. అక్కడి ప్రజలు తమను రక్షించేందుకు వీరు వచ్చారని ఆదరిస్తుంటే, శాంతి పేరిట కామకలాపాలు సాగిస్తుండటం, చిన్నారులను బలిపశువులను చేస్తుండటం సహించరాని దుర్మార్గమన్నారు.












Click it and Unblock the Notifications