Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అవును మాది తప్పే, క్షమించండి: యూఎస్ ఎయిర్ లైన్స్

ప్రయాణికుడిని దారుణంగా విమానం నుండి ఈడ్చివేసిన ఘటనపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ సంస్థ ఎట్టకేలకు దిగొచ్చింది. ఈ ఘటన భాదాకరమే అంటూ భేషరతుగా క్షమాపణలు చెప్పింది.

షికాగో:ప్రయాణికుడిని దారుణంగా విమానం నుండి ఈడ్చివేసిన ఘటనపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ సంస్థ ఎట్టకేలకు దిగొచ్చింది. ఈ ఘటన భాదాకరమే అంటూ భేషరతుగా క్షమాపణలు చెప్పింది.

ఆదివారం నాడు షికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకొన్న ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అధికంగా టిక్కెట్లు బుక్ కావడంతో యూఎస్ ఎయిర్ లైన్స్ సిబ్బంది దారుణానికి పాల్పడ్డారు.

యూఎస్ ఎయిర్ లైన్స్ విమానంలో సీట్లు ఖాళీగా లేవనే కారణంగా 69 ఏళ్ళ డేవిడ్ డావో అనే ప్రయాణికుడిపై విమాన సిబ్బంది దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు.

United Airlines apologises for dragging passenger off flight

నన్ను చంపండి, అంతేకాని నేను ఇంటికి వెళ్ళాలి అని ఆసియాకు చెందిన డాక్టర్ ఎంత వేడుకొన్నా విమానం నుండి ఈడ్చిపారేశారు. ఈ క్రమంలో ఆయన నోటి నుండి రక్తం దారాళంగా కారినా పట్టించుకోలేదు.

ఈ దారుణాన్ని తోటి ప్రయాణీకులు వీడియో తీసీ సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియోను చూసి దిగ్బ్రాంతి చెందిన నెటిజన్లు మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో యూనైటెడ్ ఎయిర్ లైన్స్ ఈసీవో అస్కార్ మునోజ్ స్పందించారు. తమ విమానంలో జరిగిన ఘటన తనను తీవ్రంగా కలతపెట్టిందన్నారు.

విమానం నుండి బలవంతంగా ఈడ్చేసిన ప్రయాణికుడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ప్రయాణికులకు మనస్పూర్తిగా క్షమాపణలను కోరారాయన. ఈ ఘటనకు పూర్తి బాధ్యతను వహిస్తామన్నారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తామని ఆయన హమీ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+