టారిఫ్ బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టారు. ఇరాన్‌తో వాణిజ్యం చేసే ఏ దేశంపై అయినా కొత్త టారిఫ్‌లను విధించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే దేశం, అమెరికాతో చేసే లావాదేవీలపై 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. దీనివల్ల ఇరాన్, దాని వాణిజ్య భాగస్వాములపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ టారిఫ్‌లు తక్షణమే అమల్లోకి వస్తాయని, ఇది తుది నిర్ణయమని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్'లో వెల్లడించారు. ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల కారణంగా అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకే ఈ టారిఫ్‌లను ప్రకటించినట్లు ట్రంప్ తెలిపారు. ఈ చర్యలు ప్రపంచవ్యాప్తంగా అమెరికా సంబంధాలపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్‌కు భారత్, టర్కీ, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలు ఉన్నాయి. ఈ టారిఫ్‌లను ఎలా అమలు చేయాలి, ఏయే దేశాలపై ప్రభావం పడాలి, మినహాయింపులు ఉంటాయా అనే వివరాలు ట్రంప్ ప్రకటనలో ఇంకా స్పష్టం చేయలేదు. గత రెండు వారాలకు పైగా ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ నిరసనలలో సుమారు 600 మంది మరణించారు. 10,670 మందికి పైగా ప్రజలను అదుపులోకి తీసుకున్నారు.
ఇరాన్‌లో హింసాత్మక పరిస్థితులు తీవ్రతరమౌతోన్నందున అమెరికా రాయబార కార్యాలయం తమ దేశ పౌరులను హెచ్చరించింది. వెంటనే ఇరాన్ వీడాలని సూచించింది. అమెరికా పాస్‌పోర్ట్ చూపినా లేదా అమెరికాతో సంబంధాలున్నట్లు తేలినా ఇరానియన్ అధికారులు నిర్బంధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అక్కడ ఆందోళనలు తీవ్రమవుతాయని, మరింత హింసాత్మకంగా మారొచ్చని యూఎస్ రాయబార కార్యాలయం తెలిపింది.
ఇరాన్ ద్వంద్వ పౌరసత్వాన్ని గుర్తించట్లేదని, అమెరికన్-ఇరానియన్ పౌరులు ఇరాన్ పాస్‌పోర్ట్‌తో తమదేశానికి రావొచ్చని పేర్కొంది. ఇరాన్ విడిచి వెళ్లేందుకు తమ సాయంపై ఆధారపడొద్దని అడ్వైజరీ సూచించింది. వెళ్లలేకపోతే తగిన నిత్యావసరాలతో సురక్షిత ప్రదేశంలో ఉండాలని, ఎప్పటికప్పుడు రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతుండాలని, తాము ఇచ్చే సూచనలను పాటించాలని కోరింది.
విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో.. అమెరికా పౌరులు అర్మేనియా లేదా టర్కీకి రోడ్డు మార్గంలో వెళ్లాలని యూఎస్ రాయబార కార్యాలయం పునరుద్ఘాటించింది. ఈ నెల 16వ తేదీ వరకు విమాన సర్వీసులు అందుబాటులో ఉండట్లేదని, ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ మార్గాలను ప్లాన్ చేసుకోవాలని ఏంబసీ సూచించింది. అర్మేనియా లేదా టర్కీకి రోడ్డు మార్గంలో ఇరాన్‌ను విడిచి వెళ్లడం శ్రేయస్కరమని తెలిపింది.
-
మే ఐ కమిన్: యుద్ధంలోకి డ్రాగన్ ఎంట్రీ.. ఇప్పుడే అసలు మజా..?? -
ఈ యుద్ధంతో 20 ఏళ్లు వెనక్కి- స్వయానా ట్రంప్ నోట -
మరో రెండు రోజుల్లో ఏదైనా జరగొచ్చు: ట్రంప్ కీలక ప్రకటన -
అమెరికా అన్నంత పనీ చేసిందీ.. ట్రంప్ చేతుల్లోకి హార్మూజ్ జలసంధి..? -
Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..! -
ఇరాన్ నష్టం రోజుకు రూ. 4,000 కోట్లు పైమాటే -
Trump Calls PM Modi: మోడీకి ట్రంప్ ఫోన్ కాల్-హార్ముజ్ పై కీలక చర్చలు..! -
ఎక్కడ కొట్టాలో అక్కడ దెబ్బకొడుతున్న డొనాల్డ్ ట్రంప్..: ఫస్ట్ ట్రిగ్గర్ -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
అమెరికాలో ‘తెలుగు’ అందాలు: చిలకలూరిపేట చిన్నది Vs కరీంనగర్ క్వీన్ -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications