ఎక్కడైనా కూలొచ్చు: గతి తప్పిన రష్యా స్పేస్ క్రాఫ్ట్ భూమివైపు దూసుకొస్తోంది
మాస్కో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎన్ఎస్)కు సామాగ్రిని తరలించేందుకు ప్రయోగించిన మానవరహిత రష్యన్ కార్గో స్పేస్ క్రాఫ్ట్ ఒకటి నియంత్రణ కోల్పోయి తిరిగి భూమి మీదకు దూసుకు వస్తోందని ఓ అధికారి చెప్పారు.
ఈ విషయాన్ని సదరు అధికారి బుధవారం వెల్లడించారు. సదరు రష్యాన్ కార్గో పేరును వెల్లడించలేదు. అయితే, ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు సామాగ్రిని తరలిస్తుందని చెప్పారు. ఇది అదుపు తప్పి భూమివైపుకు వస్తోందని, ఎప్పుడైనా ముక్కలు కావొచ్చునని చెప్పారు.

ఈ స్పేస్ క్రాఫ్ట్ ఆరువేల పౌండ్ల లేదా 2721.5 కిలోల ఆహారం, ఇంధనం, ఇతర సైంటిఫిక్ ఎక్స్‌పరిమెంట్ మెటిరీయల్స్ తదితరాలను ఐఎస్ఎస్ క్రూ మెంబర్స్ కోసం తీసుకు వెళ్తోంది.
సదరు అధికారి మాట్లాడుతూ.. ఆ స్పెస్ క్రాఫ్ట్ ఇప్పటికే కిందకు దిగుతోందని, అది ఎక్కడికి వెళ్లే వీలులేదని, కచ్చితంగా భూమి పైకే దూసుకు వస్తోందని చెప్పారు. స్పెస్ క్రాఫ్ట్ ప్రస్తుతం అదుపు చెయ్యలేని పరిస్థితిలో ఉందని తెలిపారు. స్పేస్ క్రాఫ్ట్‌తో సంబంధాలు పునరుద్ధరించుకునేందుకు శాస్త్రజ్ఞులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాగా, ఇది సూయజ్ రాకెట్ ద్వారా పంపిన ప్రోగ్రస్ ఎం27ఎంగా తెలుస్తోంది.
మరోవైపు, ఈ స్పేస్ క్రాఫ్ట్ గత నెల 30వ తేదీనే సామాగ్రిని తీసుకు వెళ్లవలసి ఉండె. ఇప్పుడు ఇది కేంద్రంతో సంబంధాలు తెగిపోయి, భూమి వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో, మరోవైపు ఐఎస్ఎస్ వ్యోమగాములు సైతం అక్కడి ఆహార నిల్వలపై ఆందోళన చెందుతున్నారు. తదుపరి స్పేస్ క్రాఫ్ట్ జూన్ 19న బయలుదేరుతుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications