అత్యంత హేయంగా: కన్నబిడ్డనే మాంసాహారంగా పెట్టిన ఐసిస్!..

ఉగ్రవాదంలో భీభత్స.. భయానక.. రౌద్రాలన్నింటిని నూరిపోసుకున్న సంస్థ ఐసిస్. టెర్రర్‌కే టెర్రర్ పుట్టించేలా ఆ సంస్థ చేస్తున్న వికృత చర్యలు ఉగ్రవాదాన్ని మరింత పరాకాష్టకు చేరుస్తున్నాయి.

బాగ్దాద్: ఉగ్రవాదంలో బీభత్స.. భయానక.. రౌద్రాలన్నింటికి అత్యంత హేయమైన భాష్యం చెబుతున్న ఉగ్రవాద సంస్థ ఐసిస్. టెర్రర్‌కే టెర్రర్ పుట్టించేలా ఆ సంస్థ చేస్తున్న వికృత చర్యలు ఉగ్రవాదాన్ని మరింత పరాకాష్టకు చేరుస్తున్నాయి. సెక్స్ బానిసల్ని తయారు చేసుకోవడం, ఒళ్లు గగుర్పొడిచే రీతిలో బహిరంగ మరణ దండనలు విధించడంతో పాటు ఐసిస్ శిక్షల్లో అత్యంత జుగుప్సాకర చీకటి కోణాలు కూడా ఉన్నాయి.

అలాంటి చీకటి కోణాల్లో తాజాగా ఓ సంఘటన వెలుగుచూసింది. తమ వద్ద సెక్స్ బానిసగా పడి ఉన్న యూదీ మహిళను తీవ్రంగా హింసిస్తోన్న ఐసిస్.. ఇటీవల ఆమె పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించింది. ఆమెకు ఇచ్చే భోజనంలో.. మాంసాన్ని కూడా కలిపి పెట్టగా.. జంతు మాంసమే అనుకుని ఆ బాధితురాలు మామూలుగానే తినేసింది.

Unsuspecting Yazidi sex slave was fed her own child by ISIS

కానీ ఆ తర్వాత తెలిసిన నిజమేంటంటే!.. ఆమె కడుపున పుట్టిన బిడ్డనే ఐసిస్ ఉగ్రవాదులు ఆమెకు మాంసాహారంగా పెట్టారు. దీన్నిబట్టి ఐసిస్ ఉగ్రవాదులు ఎంత రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటనతో ఐసిస్ ఉగ్రవాదంపై ప్రపంచవ్యాప్తంగా మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉత్తర ఇరాక్ లో ఐసిస్ చేసిన ఈ దుశ్చర్యను ది సన్, న్యూయార్క్ డైలీ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చాయి. ఐసిస్ వద్ద సెక్స్ బానిసగా మగ్గిపోతున్న ఓ మహిళను వారి చెర నుంచి ఇటీవల బయటకు తీసుకొచ్చిన క్రమంలో ఈ విషయాలు వెల్లడైనట్లు ది సన్ పేర్కొంది. ఆమెను ఓ సెల్లార్ లో బంధించిన ఐసిస్.. మూడు రోజుల పాటు తిండి పెట్టలేదని, ఆ తర్వాతి రోజు మాంసాహారంతో కూడిన ఓ ప్లేటు తీసుకొచ్చి ఆమె ముందు పెట్టారని వివరించింది.

ఆకలితో ఉన్న బాధితురాలు ఆ భోజనాన్ని ఆరగించిందని, కానీ ఆ తర్వాతే అసలు నిజం బయటపడిందని తెలిపింది. గడిచిన కొన్నేళ్లుగా 5వేల మంది యూదులను చంపిన ఐసిస్ ఉగ్రవాదులు.. మరో 6వేల మందిని కిడ్నాప్ చేసినట్లు ఐక్యరాజ్యసమితి లెక్కలు చెబుతున్నాయి. బలవంతపు మత మార్పిడులు కూడా చేయిస్తూ.. మొత్తంగా యూదుల ఉనికే లేకుండా చేయాలని ఐసిస్ ప్రయత్నిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+