బద్దలైన డ్యాంలు: 16మంది మృతి(వీడియో)
మారియానా: ఆగ్నేయ బ్రెజిల్‌లోని సమార్కో అనే ఇనుప ఖనిజం గని పక్కనే ఉన్న రెండు డ్యాంలు బద్దలయ్యాయి. డ్యాంలు తెగిపోవడంతో బురద ప్రవాహం ఓ గ్రామాన్ని ముంచేసింది. ఈ ఘటన బెంటో రోడ్రిగ్యుస్ ప్రాంతంలో చోటుచేసుకున్నది.
దాదాపు వేల మీటర్ల మేర గ్రామం బురదమయమైంది. ఈ ఘటనలో 16 మంది మరణించారని, ఏడుగురు గాయపడ్డారని, మరో 45 మంది గల్లంతయ్యారని స్థానిక మీడియా పేర్కొంది. ఆకస్మాత్తుగా బురద ప్రవాహం ముంచెత్తడంతో 600 ఇళ్లు నేలమట్టమయ్యాయి.

అనేకమంది నిరాశ్రయులయ్యారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బురద ప్రవాహంలో కార్లు, ఇతర వస్తువులు కొట్టుకుపోయాయి.
కాగా, ఈ విపత్తుపై ఇంకా సమార్కో కంపెనీ ప్రతినిధులు స్పందించలేదు. బ్రెజిల్‌లోని వాలే, ఆస్ట్రేలియాలోని బీహెచ్‌పీ బిల్లిటన్ సంయుక్తంగా ఈ కంపెనీని నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications