అమెరికాలో గవర్నర్ రేసులో 14ఏళ్ల బాలుడు: అందువల్లే సాధ్యమైంది

వాషింగ్టన్: ఏథాన్ సొన్నెబార్న్. 14 ఏళ్ల బాలుడు. అతను ఇప్పుడు వెర్మోంట్ గవర్నర్ రేసులో ఉన్నాడు. సాధారణంగా పద్నాలుగు ఏళ్లు ఉన్న బాలుడు చదువుతుంటాడు. ఉదయాన్నే లేచి పుస్తకాలు భుజాన వేసుకొని స్కూల్‌కు వెళ్తాడు. ఆటలతో ఆనందిస్తారు. కానీ ఏథాన్ సొన్నెబార్న్ మాత్రం గవర్నర్ రేసులో ఉన్నాడు.

అమెరికాలోని వెర్మోంట్ రాష్ట్రానికి చెందిన ఈ పద్నాలుగు ఏళ్ల బాలుడు చదువుకోవాల్సిన సమయంలో రాష్ట్ర గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో గెలిస్తే అతను చరిత్ర సృష్టించనున్నాడు. వెర్మోంట్ రాష్ట్ర గవర్నర్‌గా పోటీ చేసేందుకు కనీస వయస్సు నిబంధన లేదు. దీంతో అతను కూడా పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది.

ఆ బాలుడు ఏం చెబుతున్నాడంటే?

ఆ బాలుడు ఏం చెబుతున్నాడంటే?

గవర్నర్ ఎన్నికల్లో తాను గెలిస్తే రాష్ట్రంలో చేపట్టబోయే సంస్కరణలు, అభివృద్ధి పనుల అజెండాను అందరికీ వివరిస్తున్నారు. తుపాకుల విచ్చలవిడి అమ్మకాలపై నియంత్రణ, పౌరులకు ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి తదితర అంశాలపై దృష్టి సారిస్తానని తెలిపాడు.

 గెలిస్తే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్

గెలిస్తే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్

గతంలో గవర్నర్ ఎన్నికలలో గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా కైజర్ నిలిచారు. గవర్నర్‌గా గెలిచినప్పుడు అతని వయస్సు 33 ఏళ్లు. ఇప్పుడు ఎథాన్ సొన్నెబార్న్ గెలిసిస్తే రికార్డు సృష్టిస్తాడు. రాష్ట్ర చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన గవర్నర్‌గా నిలుస్తాడు.

విమర్శలు, కౌంటర్లు

విమర్శలు, కౌంటర్లు

ఇదిలా ఉండగా, రాజకీయ అనుభవం లేని ఎథాన్ సొన్నెబార్న్ గవర్నర్ రేసులో ఉండటాన్ని రాజకీయ నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రజా సేవకు వయస్సు ఏమాత్రం అడ్డంకి కాదని ఏథాన్ సొన్నెబార్న్ చెబుతున్నాడు. విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నాలు చేస్తున్నాడు.

రేసులో పెద్దవారిని ఎదుర్కొంటూ

రేసులో పెద్దవారిని ఎదుర్కొంటూ

ప్రచారంలో తనకంటే ఎంతో పెద్దవారైన, గవర్నర్ రేసులో ఉన్న వారికి ధీటుగా కౌంటర్లు ఇస్తున్నాడు ఈ బాలుడు. మార్పు తీసుకు రావడానికి సరైన అభ్యర్థిని తానే అని తనను నిలబెట్టారని అతను ఇటీవల చెప్పాడు. అదే సమయంలో అతనికి పోటీగా ఓ ట్రాన్సుజెండర్ రేసులో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+