Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బరి తెగించిన చైనా: భారత సరిహద్దుల వద్ద గప్ చుప్ గా.. !!

సరిహద్దులను దాటుకుని తరచూ భారత భూభాగంపైకి వస్తూ భారత్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్ నపొరుగుదేశం చైనా మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. తూర్పు లఢఖ్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద తరచూ ఉల్లంఘనలకు పాల్పడుతూ వస్తోన్న ఈ డ్రాగన్ కంట్రీ.. న్యూక్లియర్ పరీక్షలను నిర్వహించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలు చేసింది కూడా మరెవరో కాదు.. అగ్రరాజ్యం అమెరికా.

బాంబు పేల్చిన అమెరికా..

చైనా రహస్యంగా ఈ అణు పరీక్షలు నిర్వహించిందని అమెరికా తాజాగా బాంబు పేల్చింది. లఢక్ సమీపంలోని గాల్వాన్ లోయలో భారత బలగాలతో ఘర్షణ జరిగిన కొద్ది రోజులకే చైనా అలాంటి ఓ పరీక్ష నిర్వహించిందని పేర్కొంది. అమెరికాలో నిర్వహించిన ఓ నిరాయుధీకరణ సదస్సులో ఆ దేశ అండర్ సెక్రటరీ థామస్ జీ డైన్యాన్నో ఈ వివరాలను వెల్లడించారు. చైనా నుంచి వచ్చే ఎటువంటి ముప్పును అయినా ఎదుర్కోవడానికి కొన్ని ప్రత్యేక మార్గాలు అవసరమని ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.

US Accuses China of Secret Nuclear Tests Amid Aftermath of Galwan Clash with Indian Army Soldiers - -

వందల టన్నుల సామర్థ్యంతో అణు పరీక్షలు..

న్యూ స్టార్ట్ ఒప్పందం గడువు ముగిసిన నేపథ్యంలో- దశాబ్దాల తర్వాత మొదటిసారిగా అమెరికా, రష్యాపై అణు ఆయుధాగార పరిమితులు తొలగిపోయాయి. ఈ పరిణామాలతో చైనా తన అణు సామర్థ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా పెంచుకుంటోందని థామస్ ఆరోపించారు. చైనా వందల టన్నుల సామర్థ్యంతో అణు పేలుడు పరీక్షలు నిర్వహించిందని, ఇందులో పరీక్షల కోసం నిర్వహించిన సన్నాహాలు కూడా ఉన్నాయని ఆయన ఎక్స్ లో రాశారు.

ఇది ఎక్కడ జరిగిందనేది..

ఇది ఎక్కడ జరిగిందనేది వెలుగులోకి రాలేదు గానీ.. భారత సరిహద్దు సమీపంలో ఉండొచ్చనే వాదనలు ఉన్నాయి. చైనా తన అను కార్యకలాపాలను ప్రపంచం నుండి దాచడానికి సీస్మిక్ పర్యవేక్షణ ప్రభావాన్ని తగ్గించే పద్ధతి అయిన 'డీకప్లింగ్'ను ఉపయోగించిందని థామస్ పేర్కొన్నారు. 2020 జూన్ 22వ తేదీన అలాంటి ఓ పేలుడు సామర్థ్యాన్ని కలిగి ఉన్న అణు పరీక్షను నిర్వహించిందని వివరించారు. ఆయన చేసిన ఈ తాజా ఆరోపణలు ఆసియా- పసిఫిక్ రీజియన్, ప్రపంచ భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించాయి.

డజన్ల కొద్దీ సైనికులు..

అయిదేళ్ల క్రితం గాల్వాన్‌ లోయలో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి భారత్, చైనాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో సరిహద్దుకు ఇరువైపులా డజన్ల కొద్దీ సైనికులు మరణించారు. నాలుగు దశాబ్దాల్లో జరిగిన అత్యంత కిరాతక సరిహద్దు ఘర్షణ ఇది. 1996 నాటి ఒప్పందం ప్రకారం సరిహద్దు ప్రాంతాల్లో తుపాకులు, పేలుడు పదార్థాలు వాడకూడదు కాబట్టి, సైనికులు ఘర్షణకు దిగారు.

కల్నల్ బీ సంతోష్ బాబుతో సహా..

ఈ ఘటనలో 16వ బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్, తెలంగాణకు చెందిన కల్నల్ బీ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా కూడా అదే స్థాయిలో ప్రాణ నష్టాన్ని చవి చూసింది గానీ.. మరణాల వాస్తవ లెక్కలను ప్రపంచానికి తెలియజేయలేదు. తమ వైపు నుంచి నలుగురు మరణించినట్లు పేర్కొంది గానీ ఈ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి అప్పట్లో.

Take a Poll

గాల్వాన్ లోయ ఘర్షణ జరిగిన కొద్ది రోజులకే..

2020 జూన్ 15 నాటి గాల్వాన్ లోయ ఘర్షణ జరిగిన కొద్ది రోజులకే చైనా ఈ అణు పరీక్షలను నిర్వహించినట్లు థామస్ తెలిపారు. న్యూ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ (న్యూ స్టార్ట్) ఇటీవల ముగిసిన నేపథ్యంలో చైనా ఉదంతం వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా, రష్యాలపై అణు పరిమితులను విధించడానికి ఈ ద్వైపాక్షిక అణు ఆయుధ నియంత్రణ ఒప్పందం 2010లో కుదిరింది. ఇప్పుడది తొలగిపోయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+