అన్నంత పనిచేశాడు: సిరియాపై ఎటాక్.. రష్యా ఇరాన్‌లకు ట్రంప్ వార్నింగ్
Recommended Video

సిరియా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశారు. సిరియాలోని డౌమా నగరంపై అక్కడి సైనిక దళాలు జరిపిన రసాయనిక దాడికి ప్రతిచర్యగా.. సిరియాపై వైమానిక దాడిని మొదలుపెట్టారు..
రసాయనిక దాడికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సిరియా అల్-అసద్, అసద్ ప్రభుత్వ మద్దతుదేశాలైన రష్యా, ఇరాన్‌లను ట్రంప్ ఇటీవలే హెచ్చరించిన సంగతి తెలిసిందే. బషర్ అల్ అసద్ పాలనకు వ్యతిరేకంగానే ఈ దాడులను చేపట్టినట్టు ట్రంప్ తాజాగా స్పష్టం చేశారు.

సిరియాపై వైమానిక దాడులు మొదలుపెట్టినట్టు వైట్‌హౌజ్‌లో ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే.. సిరియా రాజధాని డమాస్కస్ లో భారీ పేలుళ్లు వినిపించాయి. ఏడేళ్ల సిరియా అంతర్యుద్దంలో ఇదో కొత్త అధ్యాయం అని అంటున్నారు.
'కొద్దిసేపటికే క్రితమే, సిరియాపై దాడులు చేయాల్సిందిగా అమెరికా భద్రతా దళాలకు ఆదేశాలిచ్చాను. రసాయనిక ఆయుధాలు ఉన్నాయన్న సిరియా నియంత బషర్ అల్-అసద్ లక్ష్యంగా ఈ దాడులు చేయమని చెప్పాను' అని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు అమెరికన్ టెలివిజన్లలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రసారమయ్యాయి.
'ఈ ఆపరేషన్‌ను ఫ్రాన్స్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లతో కలిసి సంయుక్తంగా చేపడుతున్నాం. ఆ రెండు దేశాలకు ధన్యవాదాలు. రసాయనిక ఆయుధాలు కలిగి ఉన్న ఒక భయంకర పాలనా వ్యవస్థను కూలదోయడానికి జరుగుతున్న ఊచకోత ఇది' అని ట్రంప్ చెప్పడం గమనార్హం.
అదే సమయంలో రష్యా, ఇరాన్‌లను కూడా ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. సిరియాకు ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతుగా నిలవరాదని వ్యాఖ్యానించారు.
సిరియాలోని కెమికల్ ప్రొడక్షన్‌ను నాశనం చేసేందుకే ఈ దాడులు చేస్తున్నామని అమెరికన్ అధికారి ఒకరు తెలిపారు. దాడుల్లో వివిధలక్ష్యాలను బట్టి పలు రకాల బాంబులను ఉపయోగిస్తున్నామని మరో అధికారి తెలిపారు.
రష్యా ఇప్పటికైనా ఏదో ఒకటి తేల్చుకోవాలి. ఇంకా అదే చీకటి మార్గంలో పయనిస్తారా.. లేక శాంతి కోసం మాతో కలిసి వస్తారా? అని ట్రంప్ ప్రశ్నించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications