పాక్ కు అమెరికా ఇయర్ ఎండ్ గిఫ్ట్.. భారత్ కు పెద్ద షాకే..!
అమెరికాతో పాకిస్థాన్ బిగ్ డీల్ చేసుకున్నట్లు సమాచారం. పాక్ కు చెందిన అత్యాధునిక F-16 యుద్ధ విమాన విడిభాగాలు, టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ కు సంబంధించి 686 మిలియన్ డాలర్ల విలువైన భారీ ఆయుధ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్యాకేజీలో భాగంగా లింక్- 16 వ్యవస్థలు, క్రిప్టోగ్రాఫిక్ పరికరాలు, ఏవియానిక్స్ అప్ డేట్ లు, ట్రైనింగ్, లాజిస్టికల్ సపోర్ట్ వంటివి ఉన్నాయని ప్రముఖ దినపత్రిక డాన్ తన కథనంలో పేర్కొంది.
పాకిస్థాన్- అమెరికా మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని 30 రోజులు సమీక్షించనున్నారు. చట్టసభ సభ్యులు ఈ డీల్ ను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అనంతరం దీనిపై ఓ స్పష్టత రానుంది. ఇక ఈ పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదించిన ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ F-16 విమానాల సముదాయాన్ని ఆధునీకరించడంతో పాటు వాటి ఆపరేషనల్ భద్రతా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం.
DSCA లేఖ ప్రకారం.. F-16 విమానాలను తయారు చేస్తున్న టెక్సాస్ కు చెందిన లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ.. ఈ ఒప్పందానికి ప్రధాన కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విక్రయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని DSCA లేఖ వివరించింది. 'యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ విధానం, జాతీయ భద్రతా లక్ష్యాలను ఇది బలపరుస్తుంది. అలాగే ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలలో, భవిష్యత్ కార్యాచరణలో US.. భాగస్వామ్య బలగాలతో పాకిస్థాన్ పరస్పర కార్యాచరణ సామర్థ్యాన్ని నిలబెట్టుకోవడానికి ఇది తోడ్పడుతుంది' అని పేర్కొంది.
ఈ టెక్నాలజీ సేల్ ద్వారా.. పాకిస్థాన్ Block-52, మిడ్ లైఫ్ అప్ గ్రేడ్ F-16 విమానాలను అప్‌డేట్ చేయడం అలాగే పునరుద్ధరించడం ద్వారా ప్రస్తుత, భవిష్యత్ ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.. అని లేఖ పేర్కొంది. ఈ అప్ డేట్ లు పాకిస్థాన్ వైమానిక దళం (PAF).. US వైమానిక దళం (USAF) మధ్య యుద్ధ కార్యకలాపాలు, విన్యాసాలు, ట్రైనింగ్ లో మరింత సజావుగా అనుసంధానం, పరస్పర కార్యాచరణను అందిస్తాయి. అలాగే ఈ ఒప్పందం 'యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ విధానం, జాతీయ భద్రతా లక్ష్యాలను బలపరుస్తుంది' అని.. తద్వారా పాకిస్థాన్ తన F-16 విమానాలను సురక్షితంగా, సమర్థవంతంగా అమలు చేస్తూనే ఉంటుందని లేఖ పేర్కొంది.

ఇరు దేశాల మధ్య జరిగిన ఈ ఒప్పందం మొత్తం అంచనా విలువ 686 మిలియన్ డాలర్లు. ఇందులో ప్రధాన రక్షణ పరికరాల (MDE) విలువ 37 మిలియన్ డాలర్లు కాగా, ఇతర వస్తువుల విలువ 649 మిలియన్ డాలర్లుగా ఉంది. MDE భాగంలో 92 లింక్-16 డేటా లింక్ వ్యవస్థలు ఉన్నాయి. ఇక 2021 లోనే పాకిస్థాన్.. F-16 విమానాల సముదాయానికి అప్ గ్రేడ్ ల కోసం అభ్యర్థించినప్పటికీ, ఆ సమయంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న కారణంగా వాయిదా పడింది.
-
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా...! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్












Click it and Unblock the Notifications