US bridge Collapse: అమెరికా బ్రిడ్జిని కూల్చేసిన నౌక నడిపింది మనోళ్లే-గవర్నర్ ప్రశంసలు..!
అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో 1.6 మైళ్ల పొడవైన వంతెనను సింగపూర్ కు చెందిన ఓ వాణిజ్య నౌక ఢీకొట్టడంతో అమాంతం క్షణాల్లోనే అది కుప్పకూలింది. దీని దృశ్యాలు కూడా బయటికి వచ్చాయి. దీంతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై అమెరికా పోలీసులు వెంటనే దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఇందులో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ఈ ఘటనలో భారతీయుల పాత్ర ఉన్నట్లు తేలింది.
NEW: At least 7 people are missing after cargo ship appears to lose power & slam into the support beam of the Francis Scott Key Bridge in Baltimore, Maryland.
— Collin Rugg (@CollinRugg) March 26, 2024
The ship was being piloted by a local pilot who specializes in moving in and out of the Port of Baltimore.
Two people… pic.twitter.com/fxdyEWSmUw
అమెరికాలోని బాల్టిమోర్ సిటీలో సింగపూర్ కు చెందిన ఓ కంటెయినర్ షిప్ ఢీకొట్టడంతో దాదాపు రెండున్నర కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన కుప్పకూలింది. అయితే ఈ ఘటనలో కేవలం 20 మంది మాత్రమే నీటిలో పడిపోయినట్లు నిర్దారణ అయింది. ఇంత పెద్ద వంతెన కూలిపోతే కేవలం 20 మంది మాత్రమే నదిలో పడిపోవడంపై చర్చ జరుగుతోంది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులకు అసలు కారణం తెలిసింది.

Baltimore Bridge is 1.6 miles long,
— Science girl (@gunsnrosesgirl3) March 26, 2024
this is the moment it collapsed after a cargo ship struck it in the early hours of this morning
pic.twitter.com/eA6womQlcI
సింగపూర్ కు చెందిన ఈ కంటెయినర్ షిప్ ను నడుపుతోంది పూర్తిగా భారతీయులే. వీరు నాలుగు లైన్ల ఈ వంతెనకు సమీపంలోకి రాగానే ఇక ప్రమాదం తప్పదనే అంచనాకు వచ్చేశారు. అంతే ఎమర్జెన్సీ అలారం మోగించారు. దీంతో ఈ వంతెనపైకి వచ్చిన వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు ఇప్పుడు అధికారులు తేల్చారు. దీనిపై స్పందించిన మేరీల్యాండ్ గవర్నర్ ఆ భారతీయులు హీరోలు అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. వారు సకాలంలో సైరన్ మోగించకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదంటున్నారు.
ఈ ఓడలో 22 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా భారతీయులే. డాలీ పేరు గల ఈ ఓడను నడుపుతున్న సినర్జీ మెరైన్ గ్రూప్ స్పందిస్తూ ఈ ప్రమాదంలో తమ నౌకలో అంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. వాస్తవానికి ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ యొక్క పిల్లర్ ను ఢీకొనడానికి ముందు ఓడలో లైట్లు ఆరిపోతున్నట్లు వీడియో ఫుటేజీలో కనిపించింది. అంతే కాదు దానిలో కొంత భాగం ఓడపైనే కూలిపోయింది కూడా. గంటకు తొమ్మిది మైళ్ళ వేగంతో కదులుతున్న ఈ ఓడ వంతెన స్తంభాన్ని ఢీకొనడానికి కొన్ని క్షణాల ముందు మేడే కాల్‌ని జారీ చేసిందని, దీని వల్ల రోడ్డు ట్రాఫిక్‌ను నిలిపివేసి ప్రాణాలు రక్షించామని గవర్నర్ తెలిపారు.
-
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications