పాక్ వైఖరి మార్చుకోకుంటే మేం మార్చుకుంటాం: అమెరికా ఘాటు హెచ్చరిక
హక్కానీ నెట్ వర్క్ సహా ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోకుంటే ఈసారి చర్యలు తప్పవని పాకిస్తాన్‌కు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.
వాషింగ్టన్: హక్కానీ నెట్ వర్క్ సహా ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోకుంటే ఈసారి చర్యలు తప్పవని పాకిస్తాన్‌కు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాద సంస్థలకు ఊతమిస్తే ఆంక్షలు తప్పనిసరి అన్నారు.
వాటికి ఊతమందిస్తే ఆంక్షలు తప్పవని తేల్చి చెప్పింది. ఆమెరికాతో మంచి సంబంధాలు కావాలనుకుంటే వాటిని మూసేయాల్సిందేనని సెనేటర్ జాన్ మెక్ కెయిన్ చెప్పారు.

పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు, మిలటరీ అధికారులు హక్కాని నెట్‌వర్క్‌పై చర్యలు తీసుకోని పక్షంలో అమెరికాతో సంబంధాలు తెంచుకోవాల్సి ఉంటుందని, ఆంక్షలు విధించాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించారు.
ఇటీవలే ఇస్లామాబాద్‌లో పర్యటించిన మెక్ కెయిన్ అనంతరం కాబూల్‌లో మాట్లాడారు. ఉగ్రవాదుల విషయంలో తాము చాలా స్పష్టంగా ఉన్నామని, పాకిస్థాన్ తమకు సహకరిస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.
ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు తోడ్పాటు అందిస్తున్న హక్కానీ నెట్‌వర్క్‌తోపాటు ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాక్ వైఖరి మార్చుకోకుంటే అమెరికా వైఖరి మార్చుకుంటుందన్నారు.












Click it and Unblock the Notifications