టీసీఎస్‌కు ఊహించని దెబ్బ..!: 6,000 కోట్ల జరిమానా
విస్కాన్సిన్: టాటా గ్రూప్‌లోని దేశీయ ఐటీ సర్వీసుల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)అమెరికా అనుబంధ సంస్థ టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్ సంస్థలపై విస్కాన్సిన్‌లోని అమెరికా ఫెడరల్ కోర్టు దాదాపు రూ.6,000 కోట్ల (940 మిలియన్ డాలర్లు) జరిమానా విధించింది.
అమెరికాకు చెందిన హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ 'ఎపిక్ సిస్టమ్స్' తాలూకు సాఫ్ట్‌వేర్ తస్కరణ కేసులో విస్కాన్సిస్ లోని యూఎస్ ఫెడరల్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. కాగా, దీనిపై తాము ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేస్తామని టీసీఎస్ వెల్లడించింది.
ముంబైలోని 'టీసీఎస్', తన అమెరికా అనుబంధ కంపెనీ 'టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్' సంస్థలు కలసి ఎపిక్ సిస్టమ్స్‌కు 240 మిలియన్ డాలర్లను చెల్లించాలని ఆదేశించింది. అలాగే నష్టపూర్వక జరిమానా కింద మరో 700 మిలియన్ డాలర్లు కూడా కట్టాలని స్పష్టంచేసింది.
ఎపిక్ సిస్టమ్స్ సంస్థ... తమకు సంబంధించిన వాణిజ్య రహస్యాలను, డాక్యుమెంట్ల సమాచారాన్ని, డేటాను, టీసీఎస్, టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్ సంస్థ దొంగిలించిందని 2014 అక్టోబర్‌లో మాడిసన్‌లోని యూఎస్ జిల్లా కోర్టులో కేసు దాఖలు చేసింది.

'మా అనుమతి లేకుండానే మా సాఫ్ట్‌వేర్‌ను టీసీఎస్ ఉద్యోగులు ఉపయోగించారు. టీసీఎస్ కంపెనీ ఈ సాఫ్ట్‌వేర్‌ను తన హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ 'మెడ్ మంత్ర' ప్రొడక్ట్ అభివృద్ధికి కూడా వినియోగించుకుంది'' అని ఎపిక్ సిస్టమ్స్ పేర్కొంది. ఒక టీసీఎస్ ఉద్యోగి తమకు సంబంధించిన 6,477 డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేశాడని పేర్కొంది.
దీనిపై విచారించిన న్యాయస్థానం, ఆరోపణలు వాస్తవమని ప్రకటించింది. ''విచారణ సందర్భంగా ఎపిక్ సిస్టమ్స్ అందజేసిన ధ్రువపత్రాలు చూశాం. వాటి ఆధారంగా ఇలాంటి తీర్పు వస్తుందని మేమైతే ఊహించలేదు. ఎపిక్ సిస్టమ్స్ యూజర్ వెబ్ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసిన డాక్యుమెంట్ల ద్వారా మేం ఎలాంటి ప్రయోజనం పొందలేదు.'' అని టీసీఎస్ పేర్కొంది.
అయితే తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని ఊహించలేదని, దీనిపై 30 రోజుల్లోగా ఉన్నత న్యాయస్థానానికి అపీలు చేసుకునే సదుపాయం తమకుందని, ముంబైలోని టీసీఎస్ ఉన్నతాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications