ఇరాన్ పై అమెరికా సంధించిన బ్రహ్మాస్త్రం- పాతాళంలో పాతిపెట్టినా..!!

ఇజ్రాయెల్‌- ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది. ఈ రెండు దేశాల మధ్య భీకర పోరు రోజురోజుకూ ముదురుతోంది.. కనివినీ ఎరుగని విధంగా ఉధృతమౌతోంది. వరుసగా 10 రోజూ దాడులు- ప్రతిదాడులతో అక్కడి నగరాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

అమెరికా రాకతో..

ఈ యుద్ధంలో అమెరికా అడుగు పెట్టింది. ఇరాన్ లోని మూడు అణ్వాయుధ కేంద్రాలపై వైమానిక దాడులు సాగించింది. ఇరాన్‌ అణు స్థావరాలు- ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ పై అమెరికన్ దళాలు దాడులు చేశాయి. ఇరాన్ అణు సామర్థ్యాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ దాడులు చేపట్టింది.

US dropped these Powerful bombers to Iran

శక్తిమంతం..

ఈ దాడుల కోసం రెండు B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ క్రాఫ్ట్ లను అమెరికా ఉపయోగించింది. అలాగే- ఆరు GBU 57 మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ల (MOP) ప్రయోగించింది. ఈ తరహా వార్ ఎయిర్ క్రాఫ్ట్ లను అమెరికా ఉపయోగించడం ఇదే మొదటిసారి. 30,000 పౌండ్లు అంటే సుమారు 15 టన్నుల బంకర్ బస్టర్ బాంబుతో కూడిన అమెరికన్ స్టెల్త్ బాంబర్లను ఫోర్డో అణు కేంద్రంపై జార విడిచింది.

బకర్ బస్టర్..

ఒక్కో బీ2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ 15 టన్నుల బంకర్‌ బస్టర్ బాంబులను మోసుకెళ్లగలదు. భూమిలో లోతుగా పాతిపెట్టిన ఎటువంటి కట్టడాలనైనా ధ్వంసం చేసే సామర్థ్యం వీటికి ఉంది. ఈ తరహా బాంబులను అమెరికా వినియోగించడం ఇదే తొలిసారిగా ఫాక్స్ న్యూస్ వెల్లడించింది.

భూమిని చీల్చుకుని..

GBU-57 బాంబులు అమెరికా అమ్ములపొదిలో అత్యంత శక్తిమంతమైనవిగా భావిస్తారు. భూమిపై పడ్డ మరుక్షణమే ఇవి- ఉపరితలం నుంచి 200 అడుగుల వరకూ చొచ్చుకెళ్లగలవు. నేల అయినా..60 అడుగుల మందంతో నిర్మించిన రీ-ఎన్ ఫోర్స్డ్ కాంక్రీట్‌ అయినా చీల్చుకుని దూసుకెళ్లే సామర్థ్యం వీటికి ఉంది.

పర్వత పంక్తులపై..

ఫోర్డో వంటి అత్యంత పటిష్టమైన ఇరాన్ భూగర్భ న్యూక్లియర్ స్థావరాన్ని సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ జీబీయూ- 57 బాంబులను అమెరికా ప్రయోగించింది. ఇరాన్ లోని కోమ్ సిటీకి సమీపంలోని ఎత్తయిన పర్వతంపై ఫోర్డో న్యూక్లియర్ స్థావరం నిర్మితమైంది. అమెరికా బాంబు దాడుల తరువాత దీని పరిస్థితి ఏమిటనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

ఇరాన్ విలవిల

ఫోర్డోపై వైమానిక దాడులతో పాటు, అమెరికా నేవీకి చెందిన 30 టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను నటాంజ్, ఇస్ఫహాన్ లోని అణు కేంద్రాలపై అమెరికా ప్రయోగించింది. ఇరాన్ యురేనియం శుద్ధి మౌలిక సదుపాయాల్లో అత్యంత ముఖ్యమైనవి ఈ రెండూ కూడా. అమెరికా చేపట్టి ఈ తాజా ఆపరేషన్ ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన మొట్టమొదటి దాడి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+