ఆ 10 రాష్ట్రాలు ఇవే.. అధ్యక్షుడిని డిక్లేర్ చేసే స్టేట్స్.. గతంలో కంటే మారిన ట్రెండ్
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అయితే విజయంపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సర్వేలు చెప్పగా.. అమెరికాలో కీలకమైన రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఫ్లోరిడాలో 29 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ట్రంప్ విజయం సాధించకుంటే.. అధ్యక్షుడిగా ఎన్నికవడం కష్టంగా మారుతోంది. అయితే జో డిడెన్ మాత్రం ఇందుకు మినహాయింపు.. ఎందుకంటే అతనికి ఇతర చోట్ల ఆధిక్యం ఉంటే సరిపోతోంది.

2016లో ఆధిక్యం..
పెన్సిలేన్వియాలో 20 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. 2016 ఎన్నికల్లో ట్రంప్ తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌పై వన్ పర్సెంట్ పాయింట్ ఆధిక్యంతో గెలిచారు. ఈ సారి కూడా రాష్ట్రంపై ట్రంప్‌కు పట్టు ఉంది అని అంటున్నారు. కానీ మరికొందరు మాత్రం బిడెన్ అని చెబుతున్నారు. బిడెన్ రాష్ట్రంలోని స్క్రాన్టన్‌లో జన్మించారు. ఇదీ ఆయనకు ప్లస్ పాయింట్‌గా మారింది. ఒహియోలో 18 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ట్రంప్, బిడెన్‌కు సమంగా ఓట్లు వస్తాయనే అంచనాలు ఉన్నాయి.

నువ్వా..నేనా..
జార్జియాలో 16 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. 1990 నుంచి జార్జియా రిపబ్లికన్ అభ్యర్థులకు మాత్రమే ఓటు వేస్తోంది. కానీ ప్రస్తుతం కాస్త పరిస్థితి మారింది. కొన్ని చోట్ల డెమోక్రటిక్ పార్టీ కూడా ప్రభావం చూపుతోంది. మిచిగాన్ మాత్రం డెమోక్రాట్ అభ్యర్థులకు ఓటు వేస్తోంది. ఇక్కడ 16 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి.

అప్పుడు నో.. మరీ ఇప్పుడు
అరిజోనాలో 11 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. 2018లో డెమోక్రటిక్ అభ్యర్థులు మూడు చోట్ల విజయం సాధించారు. 9లో ఐదు కాంగ్రెస్ సీట్లను గెలుచుకున్నారు. విస్కొన్సిన్‌లో 10 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. అర్బన్ ప్రాంతంలో బిడెన్‌కు మంచి పట్టు ఉంది. లొవాలో 6 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ట్రంప్ ఆధిక్యంలో ఉండగా.. బిడెన్‌కు మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెవాడలో కూడా 6 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. 2016లో మాత్రం ట్రంప్ కూడా పట్టులేదు. కానీ ఈ సారి ఎలా ఉంటుందో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications