అమెరికా అధ్యక్ష ఎన్నికలు: డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్.. ఎవరూ గెలిస్తే భారత్‌కు మేలు,
మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ గెలుస్తా..? జో బిడెన్ విజయం సాధిస్తారా.. వీరిద్దరీలో ఎవరూ గెలిస్తే భారత్‌కు మేలు జరుగుతోంది. ఆయా విభాగాలవారీగా ప్లస్, మైనస్ తెలుసుకుందాం పదండి.

ట్రంప్-బిడెన్..
విదేశీ విధానంలో ట్రంప్ వల్ల ఇండియాకు మేలు జరుగుతోంది. డ్రాగన్ కంట్రీపై గుస్సా మీదున్న ట్రంప్.. విదేశీ విధానంతో భారత్‌కు అనుకూలంగా ఉంటారు. అంతేకాదు బీజింగ్, చైనా మధ్య వారదిగా నిలుస్తారు. బిడెన్ గెలిస్తే ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దేందుకు కృషి చేస్తారు.

కఠిన వైఖరి..
విదేశాల నుంచి అమెరికా వచ్చేవారిపై ట్రంప్ కఠినవైఖరి కొనసాగుతోంది. హెచ్1బీ వీసా కోసం ఫెడరల్ కాంట్రాక్ట్స్ ఇస్తారు. గ్రీన్ కార్డు ఉన్నవారికి అమెరికా పౌరసత్వం అందజేస్తారు. అయితే బిడెన్ మాత్రం అమెరికా వచ్చేవారికి ఆంక్షలను మరింత సడలిస్తారు. గ్రీన్ కార్డు కోసం నిబంధనలను సులభతరం చేస్తారు. అయితే అమెరికన్లకు ఉపాధి కల్పనపై ట్రంప్ ఫోకస్ చేశారు. అయితే భారత్ మాదిరిగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కల్పిస్తామని చెబుతున్నారు. ఇటు బిడెన్ మాత్రం దేశంలో ఉత్పత్తి పరిమాణం పెంచుతామని తెలిపారు. విదేశాల్లో కంటే తక్కువ పన్నులతో అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు.

నల్ల జాతీయుల కోసం
అమెరికాలో ఇండియన్ బిజినెస్‌కి సంబంధించి ట్రంప్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ బిడెన్ మాత్రం నల్ల జాతీయుల కోసం 150 బిలియన్ డాలర్ల ఆర్థికసాయం అందజేస్తామని.. దీంతో చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చని బిడెన్ హామీనిస్తున్నారు. ఇదీ కచ్చితంగా ఇండియాకు మేలు చేకూర్చే అంశం. పర్యావరణానికి సంబందించి ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీకి ట్రంప్ ప్రయారిటీ ఇస్తారు. బిడెన్ మాత్రం మౌలిక వసతుల సదుపాయాల కల్పన కోసం 2 ట్రిలియన్ డాలర్లను వెచ్చిస్తారు. ఆటోమొబైల్, విద్యుత్ ఉత్పత్తి, హౌసింగ్, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం ఇస్తారు.

చిన్నారులకు ప్రాధాన్యం
ఆరోగ్య రంగం.. అమెరికన్ల కోసం మందుల తయారీ పరిశ్రమ కోసం ట్రంప్ ఊతమిస్తారు. ఒబామా హెల్త్ కేర్ స్థానంలో హెల్త్ ఇన్సూరెన్స్ కొత్త చట్టం తీసుకొస్తారు. ఇక బిడెన్ అయితే.. చిన్నారులు, వృద్దుల కోసం 775 బిలియన్ డాలర్లను కేటాయిస్తారు. ఇందులో భారతీయ సంతతీ వారికి అవకాశం ఇస్తారు. 2021 జనవరి వరకు వ్యాక్సిన్ తీసుకొస్తామని ట్రంప్ ఆశాభావంతో ఉన్నారు. బిడెన్ అయితే 7 అంశాల జాబితాతో సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం 25 బిలియన్ డాలర్లను వెచ్చిస్తామని తెలిపారు. పోలీస్ వ్యవస్థ సంస్కరణల కోసం అధికారులను నియమిస్తామని ట్రంప్ అంటున్నారు. నేరాలు చేసిన వారిపై పెనాల్టీ తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇక బిడెన్ అయితే వ్యవస్థలో మార్పు తీసుకొస్తామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications