వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో పిజ్జా టు ద పోల్స్: తిండిపోతులను పోలింగ్ కేంద్రాలకు రప్పిస్తోన్న కాన్సెప్ట్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ కొత్త కాన్సెప్ట్.. ఓటర్లను ఆకట్టుకుంటోంది. ఓటు వేయడానికి బద్దకించేలా చేస్తోన్న వారిని పోలింగ్ కేంద్రాలకు రప్పించేలా చేస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్దకొచ్చి అక్కడున్న క్యూను చూసి వెనక్కి వెళ్లదలచుకున్న వారి మనసు మార్చేలా చేస్తోంది. క్యూలో నిల్చొన్న వారి ఆకలిని తీరుస్తోందా కాన్సెప్ట్. అదే- పిజ్జా టు ద పోల్స్. అమెరికాలో ఇన్-పర్సన్ పోలింగ్ జరుగుతోన్న దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కాన్సెప్ట్ అమల్లో ఉంది. స్థానిక స్వచ్ఛంద సంస్థలు కొన్ని దీన్ని తెరమీదికి తీసుకొచ్చాయి.

 ఈ కాన్సెప్ట్ ఎలా పుట్టుకొచ్చిందంటే..?

ఈ కాన్సెప్ట్ ఎలా పుట్టుకొచ్చిందంటే..?

2016 నాటి ఎన్నికల్లో తొలిసారిగా దీన్ని తీసుకొచ్చారు. ఈ సారి కూడా అమలు చేస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ సారి రికార్డు స్థాయిలో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచీ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు పోటెత్తుతున్నారు. తమవంతు వచ్చే సరికి గంటల సమయం పడుతోంది. బారులు తీరి నిల్చున్న చాలామంది ఆకలికి గురవుతున్నారు. క్యూను వదిలి తినడానికి బయటికి వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నుంచే పిజ్జా టు ద పోల్స్ కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది.

జత కలిసిన ఎంఎన్‌సీలు..

జత కలిసిన ఎంఎన్‌సీలు..

కొన్ని స్వచ్ఛంద సంస్థలు దీన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ బాగుండటంతో కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలు వాటితో జత కలిశాయి. ఓటు వేయడానికి క్యూలో నిల్చొని ఆకలికి గురైన వారు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా పిజ్జా టు ద పోల్స్‌కు ట్విట్టర్ హ్యాండిల్‌కు ట్వీట్ చేసిన నిమిషాల వ్యవధిలో వారికి పిజ్జా సర్వ్ అవుతోంది. దీనికోసం ఓ పెద్ద నెట్‌వర్క్‌నే నిర్వహిస్తున్నారు. తమకు ట్వీట్ అందిన వెంటనే- అందులో పొందుపరిచిన నంబర్ ద్వారా ఓటర్‌కు ఫోన్ చేస్తారు.

 ట్వీట్ చేస్తే.. ఫ్రీ పిజ్జా..

ట్వీట్ చేస్తే.. ఫ్రీ పిజ్జా..


ఏ పోలింగ్ బూత్ వద్ద ఉన్నారనేది తెలుసుకుంటారు. దానికి దగ్గరగా ఉన్న రెస్టారెంట్ నుంచి అప్పటికప్పుడు పిజ్జాలను అందిస్తారు. దీనికోసం ఓటర్ల నుంచి డబ్బును వసూలు చేయట్లేదు. ఉచితంగా సర్వ్ చేస్తున్నారు. ప్రజలు ఓటు వేయడాన్ని ప్రోత్సహించేలా తాము ఈ కాన్సెప్ట్‌ను డిజైన్ చేశామని, అది కొద్దో, గొప్పో సఫలం అవుతోందని శాన్ ఫ్రాన్సిస్కోలోని లెవిస్ట్రాస్ట్ అండ్ కంపెనీ ఉపాధ్యక్షురాలు అన్నా వాకర్ తెలిపారు. దీనివల్ల స్థానిక పిజ్జా రెస్టారెంట్లకు కూడా గిరాకీ పెరుగుతోందని చెప్పారు.

58 వేలకు పైగా పిజ్జాలను డెలివరీ..

58 వేలకు పైగా పిజ్జాలను డెలివరీ..


కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని రెస్టారెంట్ల వ్యాపారాన్ని కోల్పోయాయని, వాటిని ప్రోత్సహించినట్టయిందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఇప్పటిదాకా 48 రాష్ట్రాల్లో 2,874 పోలింగ్ కేంద్రాలకు 58,649 పిజ్జాలను డెలివరీ ఉచితంగా డెలివరీ చేశామని పేర్కొన్నారు. ఈ కాన్సెప్ట్‌ను అమలు చేయడానికి తాము 13,58,740 డాలర్లను సమీకరించామని, ఇందులో నుంచి 11,87,074 మొత్తాన్ని ఖర్చు చేశామని వెల్లడించారు.

English summary
Ever wondered if you feel pangs of hunger while standing in a long queue to cast vote, what would you do? People in the US are sending pizzas to polling places with long lines through Pizza to the polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X