'Get out to Vote' అందరిదీ ఇదే నినాదం, ట్రంప్, బిడెన్ విజ్ఞప్తి..మెలానియా కూడా..
మరో నాలుగురోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ట్రంప్-బిడెన్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ప్రతీ ఓటరును ఆకట్టుకునే ప్రయత్నిస్తున్నారు. అయితే ఎన్నికలు అంటే ప్రజలు కొంత వ్యతిరేకత చూపిస్తోన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనికితోడు కరోనావైరస్ కేసులు అమెరికాలోనే ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. రండి.. బయటకు రండి.. మీ ఓటు హక్కు వినియోగించుకొండి అని కోరారు.
వచ్చే మంగళవారం అమెరికాలో ఎన్నిక జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తిచేశారు. అయితే ఓటింగ్ శాతం తగ్గకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. తమ మద్దతుదారులను పదే పదే ఈ విషయాన్ని కోరుతున్నారు. మీరు ఏం చేసినా ఫరవాలేదు.. కానీ ఓటు మాత్రం మరవొద్దు అని ట్రంప్ తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తు్నారు. అంతేకాదు మద్దతుదారులు వారి బాస్/ స్నేహితులు/ చుట్టుపక్కల వారితో ఓటు వేయించాలని కోరారు.

కుటుంబసభ్యులు, పనిచేసే మిత్రులను కూడా వెంట తీసుకొని రావాలని కోరారు. ట్రంప్‌తోపాటు మెలానియా కూడా అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. ఇప్పటివరకు ఓటు హక్క వినియోగించుకోకుంటే..(ముందస్తు ఓటు వేయకుంటే) తప్పనిసరిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బిడెన్ కూడా ఇదేవిధంగా కోరుతున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications