వర్జీనియా రిజల్ట్స్: పంచుకున్న డొనాల్డ్ ట్రంప్..జో బిడెన్: ఎవరెక్కడ విజయం సాధించారంటే?
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠతకు గురి చేస్తోన్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఒక్కటొక్కటిగా వెలువడుతున్నాయి. కీలక రాష్ట్రాల్లో ఎవరు ఆధిక్యతను సాధిస్తున్నారనేది ఇప్పటికే తేలిపోయింది. వాటికి సంబంధించిన తుది ఫలితాలు వెల్లడవుతున్నాయి. వెస్ట్ వర్జీనియా, వర్జినీయా రాష్ట్రాల ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. ఈ రెండింటినీ అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ల తరఫున పోటీలో ఉన్న జో బిడెన్ పంచుకున్నారు.
వెస్ట్ వర్జీనియాలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయాన్ని సాధించారు. ఆయనకు 47.2 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. జో బిడెన్‌కు 17,474 ఓట్లు పడ్డాయి. ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ విజయం సాధించారు. 34,543 మంది ఓటర్లు ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ట్రంప్‌కు 16,309 ఓట్లు, బిడెన్‌కు 17,474 ఓట్లు పోల్ అయ్యాయి. డొనాల్డ్ ట్రంప్‌కు అయిదు ఎలక్టోరల్ ఓట్లు పోల్ కాగా.. బిడెన్‌కు ఒక్కటీ పడలేదు. దీనితో ట్రంప్ విజయం సాధించినట్లుగా ప్రకటించారు.

2016 నాటి ఎన్నికల్లో వెస్ట్ వర్జీనియాలోనూ ట్రంప్ విజయం సాధించారు. 42 శాతం పోలింగ్ పర్సెంటేజ్ పాయింట్లతో అప్పట్లో ట్రంప్.. తన ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించారు. ఈ రాష్ట్రాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. 1996 ఎన్నికల తరువాత వెస్ట్ వర్జీనియాలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థులు ఎవరూ విజయం సాధించట్లేదు. ఒక రకంగా ఈ స్టేట్.. రిపబ్లికన్ల కంచుకోట. 1996 ఎన్నికల్లో బిల్ క్లింటన్ ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆ తరువాత ఆ పార్టీకి చెందిన అభ్యర్థులెవరూ గెలవట్లేదు.
కాగా- వర్జీనియా స్టేట్‌ను జో బిడెన్ కైవసం చేసుకున్నారు. ట్రంప్‌పై ఆయన భారీ ఆధిక్యాన్ని సాధించారు. మొత్తం 12,37,693 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో బిడెన్‌కు 4,86,488, ట్రంప్‌నకు 7,25,438 ఓట్లు పడ్డాయి. ఇక్కడ 13 ఎలక్టోరల్ ఓట్లను బిడెన్ సాధించారు. ట్రంప్‌కు పడ్డ ఎలక్టోరల్ ఓట్లు.. జీరో. దీనితో బిడెన్‌ను విజేతగా ప్రకటించారు. ఈ స్టేట్‌లో 2016 నాటి ఎన్నికల్లో డెమొక్రాట్లే గెలిచారు. ఆ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్.. డొనాల్డ్ ట్రంప్‌పై విజయం సాధించారు.












Click it and Unblock the Notifications