అమెరికా రాజకీయాలను మలుపు తిప్పిన ప్రవాస భారతీయులు: కమలా హ్యారిస్‌కు పట్టం
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ చరిత్రను తిరగ రాశారు. ఏ మహిళకూ సాధ్యం కాని రికార్డును నెలకొల్పారు. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అత్యున్నతమైన ఈ పదవికి ఎన్నికైన తొలి భారతీయ సంతతికి చెందిన మహిళ ఆమే. ఈ అత్యున్నత పదవికి ఎంపికైన ఆసియన్-అమెరికన్ మహిళ కూడా కమలా హ్యారిస్ రికార్డు నెలకొల్పారు. కమలా హ్యారిస్ సాధించిన విజయం.. అమెరికా రాజకీయాల్లో ప్రవాస భారతీయుల సత్తా ఏమిటో చాటినట్టయింది. కొత్తగా ఏర్పడబోతోన్న జో-బిడెన్ ప్రభుత్వంలోనూ డాక్టర్ వివేక్ మూర్తి వంటి కొందరు ప్రముఖులు కీలక పాత్రను పోషించబోతున్నారు.

చెన్నై నుంచి అమెరికాకు
కమలా హ్యారిస్ మూలాలు తమిళనాడులో ఉన్నాయి. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ స్వస్థలం చెన్నై. వివాహానికి ముందే ఆమె అమెరికా వెళ్లిపోయారు. కాలిఫోర్నియాలోని ఓక్లాండోలో స్థిరపడ్డారు. వృత్తిపరంగా డాక్టర్. జమైకాకు చెందిన హ్యారిస్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. 1964 అక్టోబర్ 20వ తేదీన కమలా హ్యారిస్ జన్మించారు. 2003లో శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా విజయం సాధించారు. 2016లో నిర్వహించిన అమెరికా ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. మొట్టమొదటి ప్రయత్నంలోనే ఆమె సెనెట్‌కు ఎంపిక అయ్యారు. ఈ సారి ఏకంగా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడి విజయం సాధించారు.

ఫైర్ బ్రాండ్‌గా.. ఉన్నది ఉన్నట్లు చెప్పే మనస్తత్వం
భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష పదవి కోసం ఎంపిక చేయడంలో డెమొక్రాట్లు వ్యూహాత్మకంగా వ్యవహరించారనేది స్పష్టమైంది. అమెరికా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో స్థిరపడిన ప్రవాస భారతీయలను ఆకట్టుకోవడంలో భాగంగా.. కమలా హ్యారిస్ పేరును ఖరారు చేశారు. ఆ వ్యూహం ఫలించింది. అమెరికా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు ఉన్న ఆమె ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఉన్నది ఉన్నట్టు సూటిగా చెప్పే మనస్తత్వమే ఆమెను ఈ స్థాయికి చేర్చిందంటున్నారు విశ్లేషకులు.

తాత భారత రాయబారి..
కమలా హ్యారిస్‌ది ఉన్నత వర్గానికి చెందిన కుటుంబం. ఆమె తాత పీవీ గోపాలన్.. భారత రాయబారిగా పనిచేశారు. పలు దేశాల్లో ఆయన విధులను నిర్వర్తించారు. కమలా హ్యారిస్ తల్లి డాక్టర్ శ్యామలా గోపాలన్ 60 సంవత్సరాల కిందటే ఉన్నత విద్యను అభ్యసించడానికి ఒంటరిగా అమెరికాకు తరలి వెళ్లారు. కాలిఫోర్నియాలో చదువుకున్నారు. డాక్టరేట్ పొందారు. బ్రెస్ట్ కేన్సర్ స్పెషలిస్ట్‌గా, పరిశోధకురాలిగా పేరు తెచ్చుకున్నారు.

2024 అధ్యక్ష పదవి రేసులో..
2024లో జరిగే అధ్యక్ష పదవి ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థినిగా కమలా హ్యారిస్ రేసులో నిల్చొనడానికి అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యక్షుడిగా ఉన్న వారు అధ్యక్ష పదవికి పోటీ పడటం ఆనవాయితీ. జో బిడెన్ కూడా ఇదివరకు బరాక్ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇదే సంప్రదాయం కొనసాగితే..నాలుగేళ్ల తరువాత జరిగే ఎన్నికల్లో కమలా హ్యారిస్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడటం ఖాయం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications