వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్‍‌ను వదిలేయండి: ఏకిపారేసిన ఒబామా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నేరుగా ట్రంప్‌ను టార్గెట్ చేశారు. ఉత్తర కరోలినాలోని గ్రీన్స్‌బోరోలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.

డొనాల్డ్ ట్రంప్‌కు సీనియర్‌ రిపబ్లికన్లు కూడా మద్దతు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పలు వివాదాల్లో ఇరుక్కున్నా ట్రంప్‌కు ఇంకా మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. 2005 నాటి ట్రంప్‌ వీడియో క్లిప్స్‌ను చూసి ఇప్పటికే చాలా మంది రిపబ్లికన్లు ఆయనకు దూరంగా ఉంటున్నారని చెప్పారు.

US election: Obama blasts Trump with 7-Eleven jibe

కానీ ట్రంప్‌ వారిని విశ్వాసఘాతకులుగా చిత్రీకరిస్తున్నారన్నారు. ఇంత జరిగాక కూడా కొందరు ట్రంప్‌కే మద్దతు ఇస్తున్నారని, అది అర్థవంతం కాదన్నారు. అలాగే మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ట్రంప్ పైన నిప్పులు చెరిగారు.

ఇదిలా ఉండగా, బరాక్ ఒబామా మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి పలుమార్లు అతని ప్రసంగానికి అడ్డుతగిలారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందని, అదే గొప్ప అని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం అతడిని భద్రతా సిబ్బంది అక్కడి నుంచి తరలించారు.

English summary
President Barack Obama has blasted Donald Trump's recent remarks about women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X