కిటికీ అద్దాలను కప్పేసి, అబ్జర్వర్లను బయటికి పంపి: బ్యాలెట్ల కౌంటింగ్: ట్రంప్ డౌట్లు నిజమేనా?

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల సమయంలో తన ప్రత్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారని, దొడ్డిదారిన విజయాన్ని సాధించడానికి ఆరాటపడుతున్నారంటూ ఆ దేశాధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వ్యక్తం చేస్తోన్న అనుమానాలు నిజమే అనిపించేలా కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి- పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ట్రంప్ చేస్తోన్న ఆరోపణలు వాస్తవం ఉందనిపించే ఘటన ఇది.

డెట్రాయిట్‌ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..

మిచిగాన్‌లోని డెట్రాయిట్‌లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కేంద్రం వద్ద చోటు చేసుకుంది. కొన్ని గంటల కిందటి వరకూ మిచిగాన్‌లో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యతలో ఉన్నారు. పోస్టల్, ఇ-మెయిల్ బ్యాలెట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ ఆయన మెజారిటీ తగ్గుతూ వచ్చింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ పైచేయి సాధిస్తూ వచ్చారు. చివరికి ఇక్కడ జో బిడెన్ ఆధిక్యతను సాధించారు. ఈ పరిస్థితుల్లో డెట్రాయిట్‌లోని ఓ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కేంద్రం వద్ద సిబ్బంది అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడానికి

పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడానికి ఉద్దేశించిన గదికి సంబంధించిన కిటికీ అద్దాలను థర్మోకోల్ షీట్లతో మూసివేశారు. టీసీఎఫ్ అనే ఓ కన్వెన్షన్ (TCF Centre) సెంటర్‌ను పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కేంద్రంగా మార్చారు. ఆ సెంటర్‌ను ఎన్నికల అధికారులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల పరిశీలకులను కూడా అక్కడి గదుల్లోకి రానివ్వలేదు. లోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ పరిణామాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి.

ట్రంప్ మద్దతుదారులు, పరిశీలకులను రానివ్వకుండా..

రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. పోలింగ్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. తమను లోనికి రానివ్వాలంటూ రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు డిమాండ్ చేశారు. గట్టిగా నినాదాలు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును వెంటనే నిలిపివేయాలని పట్టుబట్టారు. నిష్పక్షపాతంగా లెక్కింపును చేపట్టేంత వరకూ ఫలితాలను వెల్లడించకూడదని నినాదలు చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులను మోహరింపజేశారు.

 థర్మోకోల్ షీట్లతో విండోలు క్లోజ్..

థర్మోకోల్ షీట్లతో విండోలు క్లోజ్..

కొంతమంది ఎన్నికల పరిశీలకలను తాము ఓట్ల లెక్కింపు గదిలోనికి రానివ్వలేదనే విషయాన్ని ఎన్నికల అధికారులు అంగీకరించారు. గది సామర్థ్యం సరిపోకపోవడం వల్ల కొందరిని మాత్రమే తాము బయటికి పంపించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. బయటికి వెళ్లిన వారిని మాత్రమే తాము మరోసారి లోనికి రానివ్వలేదని చెప్పారు. లెక్కింపు కేంద్రం కిటికీ అద్దాలను థర్మోకోల్ షీట్లతో మూసివేశారు. దీన్ని రిపబ్లికన్ మద్దతుదారులు అడ్డుకున్నారు. డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులు కూడా పెద్ద సంఖ్యలో టీసీఎఫ్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. ఈ రెండు పార్టీల మద్దతుదారుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పలితంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మిచిగాన్‌లో లీడ్‌లో బిడెన్..

మిచిగాన్‌లో లీడ్‌లో బిడెన్..

మిచిగాన్‌లో డొనల్డ్ ట్రంప్ తొలుత లీడ్‌‌లో కొనసాగినప్పటికీ.. పోస్లల్ బ్యాలెట్ల లెక్కింపును చేపట్టిన తరువాతే ఆయన వెనుకపడ్డారని రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అనేక అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని మండిపడుతున్నారు. కౌంటింగ్‌ను నిష్పక్షపాతంగా చేపట్టాల్సిన ఎన్నికల అధికారులే ఇలా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని భగ్గుమంటున్నారు. పరిశీలకులను సైతం లోనికి రానివ్వట్లేదని, తమకు మెజారిటీ వచ్చినప్పటికీ.. వాటిని కప్పిపెడుతున్నారని విమర్శిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+