టెక్సాస్ థ్రిల్లర్.. రేసులోకొచ్చిన ట్రంప్: మళ్లీ హోరాహోరీ: తలరాతను మార్చే 6 రాష్ట్రాలు
వాషింగ్టన్: అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు ఉన్న టెక్సాస్‌లో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యతను ప్రదర్శించారు. ఆయనను అధ్యక్ష పదవి రేసులో నిలిపింది టెక్సాస్. కాలిఫోర్నియా తరువాత ఆ స్థాయిలో ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి ఈ స్టేట్‌లో. 38 ఎలక్టోరల్ ఓట్లను డొనాల్డ్ ట్రంప్ సాధించారు. దీనితో ఆధిక్యత మళ్లీ చేతులు మారే పరిస్థితికి చేరుకుంది. డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ మధ్య ఉన్న ఎలక్టోరల్ ఓట్ల ఆంతర్యం భారీగా తగ్గింది. మళ్లీ హోరాహోరి పోరు నెలకొంది. టెక్సాస్‌లో 38 ఎలక్టోరల్ ఓట్లను తన ఖాతాలో వేసుకోవడంతో డొనాల్డ్ ట్రంప్ ఆయన ఆధిక్యత పెరిగింది. 210కి చేరుకుంది.

తొలుత భారీ ఆధిక్యతను సాధించినా..
అమెరికా అధ్యక్ష పదవి కొనసాగుతోన్న రేసులో విజేత ఎవరో ఇప్పుడిప్పుడే స్పష్టమౌతోంది. ఇప్పటిదాకా హోరాహోరీగా సాగిన పోరు.. ఒక్కసారిగా ఏకపక్షంగా మారిపోయింది. దీనికి ఒకే ఒక్క కారణం.. కాలిఫోర్నియా. అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు ఉన్న కాలిఫోర్నియాలో డెమొక్రటిక్ అభ్యర్థి జో బిడెన్ ఘన విజయాన్ని సాధించారు. ఈ స్టేట్‌లో 55 ఎలక్టోరల్ ఓట్లు బిడెన్‌కు పడ్డాయి. దీనితో ఒక్కసారిగా జో బిడెన్..మేజిక్ ఫిగర్‌కు చేరువ అయ్యారు. అమెరికా అధ్యక్ష పదవిని సాధించాలంటే.. అత్యంత కీలకంగా భావించే స్టేట్ ఇది. ఇక్కడ బిడెన్ మెజారిటీని అందుకోవడం ఫలితం ఏమిటనేది తేటతెల్లమైంది.

రేసులో వెనుకంజలో ఉన్నా..
చాలా రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యతను కనపరుస్తున్నప్పటికీ.. కాలిఫోర్నియా తరువాత ఆధిక్యత మారిపోయింది. కాలిఫోర్నియాలో 70 శాతం ఓట్లు బిడెన్‌కు పోల్ అయ్యాయి. కాలిఫోర్నియా ఫలితం తరువాత జో బిడెన్్ 223 స్థానాల్లో ఆధిక్యతను సాధించగా.. ట్రంప్ 148 వద్ద ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 270. భారతీయుల ఓటుబ్యాంకు అధికంగా ఉండే రాష్ట్రాల్లో జో బిడెన్ భారీ మెజారిటీని సాధించారు. డొనాల్డ్ ట్రంప్‌నకు అనుకూలంగా ఉండే మీడియా ఫాక్స్ న్యూస్ కూడా.. జో బిడెన్ గెలుస్తాడని అంచనా వేసింది. బిడెన్ మెజారిటీ సాధిస్తారని స్పష్టం చేసింది.

ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యతలో
కాలిఫోర్నియా తరువాత ఆరు రాష్ట్రాల్లో జో బిడెన్ మెజారిటీని సాధించారు. ఒరేగాన్-7, వాషింగ్టన్-12, అరిజోనా-11, న్యూమెక్సికో-5, హవాయ్-4, మిన్నెసోటా-10 ఎలక్టోరల్ ఓట్లు జో బిడెన్‌కు పడ్డాయి. దీనితో ఆధిక్యత మళ్లీ పెరిగింది. 237కు చేరుకుంది. టెక్సాస్ తరువాత డొనాల్డ్ ట్రంప్ ఇహోవాలో మాత్రమే విజయం సాధించారు. అక్కడ ఆరు ఎలక్టోరల్ ఓట్లు పోల్ అయ్యాయి. కాగా- మొంటానా, విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియాల్లో ప్రస్తుతం ఎలక్టోరల్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యతలో ఉన్నారు. ఫలితంగా- డొనాల్డ్ ట్రంప్ మెజారిటీని సాధించే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications