అమెరికా ఎన్నికల్లో ఆంధ్రా మహిళ ఓటమి: ట్రంప్ పార్టీ నుంచి పోటీ చేసినా వ్యతిరేక ఫలితం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల హవా వీస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు భారతీయులు విజయం సాధించారు. రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్, డాక్టర్ అమీ బెరా, రో ఖన్నా వంటి నేతలు విజయం సాధించారు. తెలుగు మహిళ ఒకరు పరాజయాన్ని చవి చూశారు. ఆమె పేరు మంగ అనంతాత్ముల. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా వర్జీనియా నుంచి పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. తన సమీప ప్రత్యర్థి, డెమొక్రటిక్ అభ్యర్థి గెర్రీ కొన్నొల్లీ చేతిలో ఓటమి పాలయ్యారు. గెర్రీకి 71.7 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. మంగ అనంతాత్ములకు పడ్డ ఓట్ల శాతం 28.3 శాతం మాత్రమే.
ఈ ఏడాది జనవరి 26వ తేదీన ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వర్జీనియా నుంచి రిపబ్లికన్ తరపున పోటీచేస్తున్న తొలి ఇండో అమెరికన్‌గా గుర్తింపు పొందారు. వర్జీనియా డెమొక్రాట్లకు కంచుకోట. ఈ స్టేట్‌లో 17 శాతం ఆసియా దేశాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. అందులో ఏడుశాతం మందికిగా భారతీయులే. రాజకీయాల్లోకి రాకముందు మంగ డిఫెన్స్ అక్విజిషన్ ప్రోగ్రాంలో పని చేశారు. ఏపీలో జన్మించిన మంగా అనంతాత్ముల చెన్నైలో చదువుకున్నారు.

అనంతరం ఆగ్రా యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. 1990లో భర్త, కుమారుడితో కలిసి అమెరికాకు వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. సాధారణంగా అమెరికాలో స్థిరపడ్డ ఆసియా దేశాల వారు ముఖ్యంగా భారతీయులు డెమొక్రాట్ అభ్యర్థులకే మద్దతుగా నిలుస్తారు.దీనికి భిన్నంగా ఆమె రిపబ్లికన్ పార్టీలో చేరారు. వర్జీనియాపై పట్టు సాధించగలనని ధీమాతో ఉన్నప్పటికీ..అది వాస్తవారూపం దాల్చలేదు. ఎన్నికల ఫలితాలు ఆమెకు ప్రతికూలంగా వెలువడ్డాయి. డెమొక్రాట్ల అభ్యర్థి గెర్రీకి 2,71,400 ఓట్లు పోల్ అయ్యాయి. మంగకు 1,07,368 మంది ఓటు వేశారు. గెర్రీ ఈ స్థానాన్ని గెలవడం వరుసగా ఇది ఆరోసారి.
-
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications