డొనాల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించారా? ఆ ట్వీట్‌కు అర్థమేంటీ?: రాత్రికి బిగ్ అనౌన్స్‌మెంట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించారా? ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎలక్టోరల్ ఓట్ల ఫలితాలు వెలువడాల్సి ఉండటం, ఆయా చోట్ల రిపబ్లికన్ పార్టీ ఆధిక్యతలో కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తి రేపుతోంది. ఓటమిని ముందే అంగీకరించినట్టుగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉండటం వల్ల రిపబ్లికన్లకు విజయంపై ఆశలు దోబూచులాడుతున్నాయి. ఈ సారి అమెరికన్లు డెమొక్రాట్ల వైపే మొగ్గు చూపుతున్నారంటూ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
అధ్యక్ష ఎన్నికల్లో తాము గెలవబోతున్నామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై ఆయన ఓ ట్వీట్ చేశారు. అదే సమయంలో- ప్రజా తీర్పును డెమొక్రటిక్ పార్టీ నేతలు తస్కరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను దొంగిలించడానికి డెమొక్రాట్లు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. ఓటు వేయడానికి నిర్దేశించిన సమయం ముగిసిన తరువాత కూడా పోలింగ్ నిర్వహించడానికి ప్రయత్నించడం చట్టవ్యతిరేకమని చెప్పారు. ఫలితాలు వెలువడిన తరువాత తాను ఓ ప్రకటన చేయబోతున్నట్లు తెలిపారు.

I will be making a statement tonight. A big WIN!
— Donald J. Trump (@realDonaldTrump) November 4, 2020
పోలింగ్ ప్రారంభానికి ముందే- డొనాల్డ్ ట్రంప్ ఇదే తరహా అనుమానాలను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఓటింగ్ ప్రక్రియను దెబ్బతీసేలా, పక్కదారి పట్టించేలా డెమొక్రాట్లు వ్యవహరిస్తున్నారంటూ విమర్శించారు. ఎన్నికల ఫలితాలపై తాను న్యాయస్థానంలో సవాల్ చేస్తాననీ పేర్కొన్నారు. అదే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఈ ట్వీట్‌తో స్పష్టం చేసినట్టయింది. ప్రజా తీర్పును ఎవరూ దారి తప్పించలేరని, తస్కరించలేరంటూ ఆయన పేర్కొనడం.. ఓటమిని అంగీకరించినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.












Click it and Unblock the Notifications