అమెరికాలో మళ్లీ ఎన్నికల వేడి: ఎలక్టోరల్ కాలేజ్ తాజా ప్రకటన: ఓట్ల లెక్కింపు వివాదాలకు తెర
వాషింగ్టన్: అమెరికాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మళ్లీ వేడెక్కింది. కిందటి నెల ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ ముసురుకుంటూ వస్తోన్న వివాదాలకు తెర పడింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఎవరిని వరించిందనే విషయాన్ని ఎలక్టోరల్ కాలేజ్ ప్రకటించింది. విజయం.. జో బిడెన్‌ను వరించినట్లు నిర్ధారించింది. మొన్నటి ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్, రిపబ్లికన్ల అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పోల్ అయిన ఓట్ల సంఖ్యను ఖరారు చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే అధికారిక ప్రకటన జారీ చేసింది.
Recommended Video

కొత్త అధ్యక్షుడు జో బిడెన్..
అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బిడెన్ విజయాన్ని ఎలక్టోరల్ కాలేజ్ ధృవీకరించింది. ఆయనకు 306 ఓట్లు పడినట్లు వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్ 232 ఎలక్టోరల్ ఓట్లను సాధించినట్లు తెలిపింది. ఇదివరకు డొనాల్డ్ ట్రంప్ కోరకున్నది కూడా ఇదే. ఎలక్టోరల్ కాలేజ్ అధికారికంగా ప్రకటిస్తేనే తాను ఓడిపోయినట్లు అంగీకరిస్తానని షరతు పెట్టారాయన. దీనితో ఎలక్టోరల్ కాలేజ్ బరిలోకి దిగాల్సి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పునఃసమీక్షించింది. రాష్ట్రాలవారీగా పోల్ అయిన ఓట్ల సంఖ్యను మళ్లీ లెక్కించింది. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల సంఖ్యను నిర్ధారించింది.

ఏడు మిలియన్ల ఓట్ల తేడా..
జో బిడెన్-డొనాల్డ్ ట్రంప్ మధ్య ఏడు మిలియన్ల ఓట్ల తేడా ఉన్నట్లు ఎలక్టోరల్ కాలేజ్ పేర్కొంది. అత్యంత వివాదాస్పదంగా, అభ్యర్థుల గెలుపోటములను తలకిందులు చేసినట్లుగా భావిస్తోన్న అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవడా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లల్లో ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదని తాము అంచనా వేస్తున్నట్లు తెలిపింది. చివరి రౌండ్ ఓట్ల లెక్కింపులో జో బిడెన్ ఆధిక్యతను సాధించడం వల్లే ఆయా రాష్ట్రాల్లో స్వల్ప మెజారిటీతో బిడెన్ విజయం సాధించినట్లు స్పష్టం చేసింది.

వాట్ నెక్స్ట్?
ఎలక్టోరల్ కాలేజ్ అధికారిక ప్రకటనతో డొనాల్డ్ ట్రంప్ ఇక తన ఓటమిని అంగీకరించక తప్పని పరిస్థితి నెలకొంది. ఇక ఆయన వైట్‌హౌస్‌ను వీడటం ఖాయంగా కనిపిస్తోంది. ఎలక్టోరల్ కాలేజ్ లెక్కించిన ఓట్లను కాంగ్రెస్‌కు పంపిస్తారు. వచ్చేనెల 6వ తేదీన మరోసారి కాంగ్రెస్‌లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ పర్యవేక్షణలో కాంగ్రెస్‌లో ఓట్లను లెక్కిస్తారు. అది లాంఛనప్రాయమే. అమెరికా కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులెవరనే విషయాన్ని కాంగ్రెస్ ప్రకటిస్తుంది. అక్కడితో ఈ ప్రక్రియ ముగుస్తుంది. అదే నెల 20వ తేదీన అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేస్తారు.

జో బిడెన్ ఏం చెప్పారంటే..
ఎలక్టోరల్ కాలేజ్ తాజాగా చేసిన ప్రకటన పట్ల జో బిడెన్ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా.. వాస్తవ ఫలితం ఏమిటనేది తేలిపోయిందని అన్నారు. డెమొక్రాట్లకు ప్రజలు పట్టం కట్టారని, వారిని అకాంక్షలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థకు ఈ ఎన్నికలు అద్దం పట్టాయని పేర్కొన్నారు. సమసమాజాన్ని స్థాపించేలా, జాతి, వర్ణ భేదాలు లేకుండా కొత్త ప్రభుత్వం పరిపాలన ఉంటుందని హామీ ఇచ్చారు. డెమొక్రాట్లను గెలిపించిన అమెరికన్లు నిజమైన హీరోలని జో బిడెన్ అభివర్ణించారు. వారికి కృతజ్ఙతలు తెలిపారు.












Click it and Unblock the Notifications