భారత వలసలపై ట్రంప్ సీరియస్..
అమెరికా.. మరోసారి అక్రమ వలసపై దృష్టి సారించింది. భారత్ సహా అన్ని దేశాలకూ హెచ్చరికలను జారీ చేసింది. చట్టవిరుద్ధంగా నివసిస్తోన్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. విసా మోసాలకు పాల్పడిన వారినీ వదలబోమని అమెరికా తేల్చి చెప్పింది.
ఈ మేరకు భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా, చట్టవిరుద్ధంగా తమ దేశంలో నివసించడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటోన్నామని స్పష్టం చేసింది. తప్పుడు డాక్యుమెంట్లతో విసాలను పొందిన వారిని బాధ్యులుగా ఉంటారని పేర్కొంది.

తమ దేశ చట్టాన్ని ఉల్లంఘించే వారెవరైనా సరే.. కఠిన శిక్షను ఎదుర్కొన తప్పదని భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం తేల్చి చెప్పింది. అక్రమ వలసలపై డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కఠిన చర్యలు తీసుకుంటోందని గుర్తు చేసింది. దీనికి కాలిఫోర్నియా ఉదంతం ఉదాహరణగా పేర్కొంది.
ఇటీవలే కాలిఫోర్నియాలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. లాస్ ఏంజిలిస్ లోనూ ఇవే తరహా పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జూన్ 7వ తేదీన కాలిఫోర్నియా నేషనల్ గార్డ్ ను తమ ఆధీనంలోకి తీసుకోవాల్సి వచ్చింది. 4000 మంది సైనికులను మోహరించారు అప్పట్లో. దీనికి ప్రధాన కారణం అక్రమ వలసవాదులేననే అంచనాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్ విధానాలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది అమెరికా. అక్రమ వలసదారుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలనీ భావిస్తోంది. దీనికి అనుగుణంగా భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం తాజా హెచ్చరికలను జారీ చేసింది. దాదాపు అన్ని దేశాల్లో ఉండే అమెరికా రాయబార కార్యాలయాలు ఈ మేరకు హెచ్చరికలను జారీ చేయనున్నాయి.
భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం మే నెలలో విసా దరఖాస్తులకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. అమెరికా విసా కోసం స్క్రీనింగ్ డాక్యుమెంట్లను తప్పనసరి చేస్తూ ఈ నెల 26వ తేదీన మరో ప్రకటన ఇచ్చింది. విసా హోల్డర్లు అన్ని అమెరికా చట్టాలు, ఇమ్మిగ్రేషన్ నియమాలను పాటిస్తున్నారో లేదో నిర్ధారించుకోవడానికి నిరంతర తనిఖీ చేస్తామనీ తెలిపింది.
ఈ తనిఖీలకు సహకరించకపోతే విసాలను రద్దు చేస్తామని, వారిని డిపోర్ట్ చేస్తామనీ స్పష్టం చేసింది. " అని రాయబార కార్యాలయం Xలో ఒక పోస్ట్‌లో వివరించింది. ఇమ్మిగ్రేషన్ చట్టాల అమలు, అక్రమ వలసదారుల వ్యవహారంపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిఘా పెంచిందని రాయబార కార్యాలయం పేర్కొంది.
-
ఇరాన్ సుప్రీమ్ లీడర్ గా కీలక నేత.: నియామకం వెనుక? -
ఇరాన్ యుద్ధంపై అమెరికా స్ట్రాటజిక్ స్టేట్ మెంట్- ఎపిక్ ఫ్యూరీ ఆగేది కాదు -
ఆ నినాదంతో బలంగా.. ట్రంప్ బాటలో కవిత! -
యుద్ధ నౌకపై హెచ్చరిక లేకుండా అమెరికా చర్య.. మూల్యం చెల్లించక తప్పదన్న ఇరాన్! -
రోజూ చపాతీలు తింటున్నారా - ఈ జాగ్రత్తలు అవసరం, లేదంటే..!! -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
జాక్‌పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్‌గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం?












Click it and Unblock the Notifications