భారత్ నుంచి అమెరికా వెళ్లేవారికి బిగ్ షాక్
అమెరికా వెళ్లాలనే కల మనదేశంలో చాలా మంది యువతకు ఉంటుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని యువతకు అమెరికా యావ ఎక్కువ. ఎలాగైనా అగ్రరాజ్యంలో అడుగుపెట్టి నాలుగు రాళ్లు వెనకేసుకుని ఇంటికి పంపించాలని అనుకుంటూ ఉంటారు. అయితే భారత్ నుంచి అమెరికా వెళ్లాలనుకునేవారికి మరో షాక్ ఇచ్చింది అమెరికా. ఈ మేరకు భారత్ లోని అమెరికన్ ఎంబసీ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
మనదేశం నుంచి అమెరికా వెళ్లాలనుకునేవారికి భారత్ లోని అమెరికన్ ఎంబసీ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. వీసాలు జారీ చేసిన తర్వాత కూడా తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పేర్కొంది. అమెరికాలోని చట్టాలు, వలస నిబంధనలు ఉల్లంఘించే వారిపై వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. రూల్స్ ను అతిక్రమించిన వారి వీసాలు రద్దు చేసి.. స్వదేశానికి పంపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలో భారతీయ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ దేశాలపై మళ్లీ టారిఫ్ ల మోత మోగిస్తున్నారు. తాజాగా మెక్సికో, ఈయూ దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులపై 30 శాతం టారిఫ్ లు విధించనున్నట్లు పేర్కొన్నారు. ఈ రూల్స్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇక పొరుగు దేశమైన కెనడాపైనా ట్రంప్ సుంకాలు విధించారు. కెనడా నుంచి అమెరికాలోని వచ్చే ఉత్పత్తులపై 35 శాతం టారిఫ్ లు విధించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకే ట్రంప్ ఈ నిర్ణయాలు తీసకుంటున్నట్లు తెలుస్తోంది.
🚨 🚨 #BreakingNews US embassy in India issues fresh visa revocation, deportation warning: 'Screening doesn't stop' https://t.co/lvYgvQu7q5
— Instant News ™ (@InstaBharat) July 12, 2025
In a fresh advisory, the US embassy in India said on Saturday that “screening does not stop after a visa is issued.”#TrendingNews #Big…
ఇక భారత్ పైనా ట్రంప్ ప్రభుత్వం మూడు నెలల క్రితం 26 శాతం టారిఫ్ లు విధించింది. కానీ వాటిని 90 రోజులపాటు నిలిపివేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చర్చలు ఫలిస్తే ప్రస్తుతం ఉన్న భారీ దిగుమతి సుంకాలు 20 శాతం దిగువకు తగ్గిపోతాయని భారత వాణిజ్య శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు అమెరికా కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, లోహాల వంటి కీలక రంగాల్లో ఈ తగ్గింపు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications