చట్టాలను ఉల్లంఘిస్తే వీసా రద్దు.. ఇండియన్ స్టూడెంట్స్ కు అమెరికా వార్నింగ్
భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం బుధవారం విద్యార్థులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే వీసాలు రద్దు, దేశ బహిష్కరణ, భవిష్యత్తు ప్రయాణాలపై దీర్ఘకాలిక నిషేధం వంటి తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. అమెరికా వీసా హక్కు కాదని, అది కేవలం ఒక ప్రత్యేకమైన వెసులుబాటు మాత్రమేనని, దేశంలోకి ప్రవేశం అక్కడ నిబంధనలకు పాటించడంపైనే ఆధారపడి ఉంటుందని కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా అమెరికా రాయబార కార్యాలయం పోస్టు పెట్టింది.
"అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే మీ విద్యార్థి వీసాకు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. మిమ్మల్ని అరెస్టు చేసినా లేదా ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించినా, మీ వీసా రద్దు కావొచ్చు. మిమ్మల్ని బహిష్కరించవచ్చు. అలాగే భవిష్యత్తులో అమెరికా వీసాలకు మీరు అనర్హులు అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఈ నిబంధనలను పాటించండి, మీ ప్రయాణాన్ని ప్రమాదంలో పడేయకండి. అమెరికా వీసా హక్కు కాదు, అది ఒక విశేషాధికారం (privilege) మాత్రమే." అని స్పష్టం చేసింది.
అమెరికాలో వలస నిబంధనల అమలుపై పర్యవేక్షణ పెరిగిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. విదేశీయులు చట్టపరంగా మాత్రమే అమెరికాలో నివాసం కొనసాగించాలని అధికారులు తరచుగా హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు డిసెంబర్ 26 నుండి నాన్-యూస్ పౌరులు (గ్రీన్ కార్డ్ హోల్డర్ లతో సహా) అందరికీ సరిహద్దు పాయింట్ల వద్ద తప్పనిసరి బయోమెట్రిక్ తనిఖీలు అమల్లోకి వచ్చాయి.
కొత్త నిబంధన ప్రకారం, అమెరికన్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారులు విమానాశ్రయాలు, సరిహద్దులు, సముద్ర మార్గాల ప్రవేశ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద నాన్-యూఎస్ పౌరులందరి ఫోటోలు తీసుకుంటారు. 14 ఏళ్ల లోపు పిల్లల నుండి 79 ఏళ్లు పైబడిన వృద్ధుల వరకు, దేశంలోకి వచ్చేవారు లేదా బయలుదేరే వారందరికీ ఈ విధానం వర్తిస్తుంది.

భద్రత, వీసా గడువుకు మించి నివాసం ఉండటం వంటి ఆందోళనలను పరిష్కరించడమే ఈ బయోమెట్రిక్ వ్యవస్థ లక్ష్యం అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (DHS) తెలిపింది. గతంలో పైలట్ కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైన నిష్క్రమణ బయోమెట్రిక్ సేకరణ ఇప్పుడు తప్పనిసరి చేసింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications