Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

H1B Visa లపై చుక్కలు చూపిస్తోన్న ట్రంప్- తాజా Vetting: భారత్ కు భారీ కుదుపు..!!

హెచ్1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారులకు అమెరికా చుక్కలు చూపిస్తోంది. దరఖాస్తు చేసుకున్న వాళ్లందరి సోషల్ మీడియా, ఆన్‌లైన్ యాక్టివిటీలను పరిశీలిస్తోన్న అమెరికా.. ఇప్పుడు దీన్ని అన్ని దేశాలకూ విస్తరింపజేసింది. ఇదివరకు కొన్ని దేశాలకే పరిమితమై ఉండేదీ విధానం.. తాజాగా అన్ని దేశాల నుంచి అదే హెచ్ 1బీ, హెచ్ 4 వీసా దరఖాస్తులన్నింటికీ వర్తింపజేసినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. దీనిపై భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ట్వీట్ పోస్ట్ చేసింది.

దీనివల్ల ఎక్కవశాతం ప్రభావం భారత్ పైనే పడుతోంది. ప్రతి సంవత్సరం 70 శాతానికి పైగా హెచ్-1బీ వీసా దరఖాస్తులు దాఖలయ్యేది భారత్ నుంచే. దీని తర్వాత రెండో స్థానంలో చైనా ఉంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనుసరిస్తోన్న ఈ కఠిన విధానాల మధ్య తాజాగా అమలులోకి వచ్చిన ఈ మార్పు వందలాది భారతీయ పౌరులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ తనిఖీలను స్టేట్ డిపార్ట్‌మెంట్ అథెంటికేషన్ లో భాగమని పేర్కొంది.

US Expands Social Media Screening to All H-1B and H-4 Visa Vetting Worldwide

ప్రపంచవ్యాప్తంగా హెచ్-1బీ, హెచ్-4 వీసాలకు దరఖాస్తు చేసుకునే అన్ని దేశాల పౌరులకు ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని ఆ శాఖ వెల్లడించింది. హెచ్-1బీ, హెచ్-4 వీసాల కోసం అన్ని దేశాల దరఖాస్తుదారులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఈ పరిశీలన జరుగుతోందని స్పష్టం చేసింది. విదేశీ నిపుణులను నియమించుకోవడానికి అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూనే.. హెచ్-1బీ ప్రోగ్రామ్ దుర్వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా నిబంధనలను కఠినతరం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా హోల్డర్లపై పర్యవేక్షణ తీవ్రతరం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హెచ్-1బీ, ఎఫ్-1, జే-1 వంటి అనేక వీసా కేటగిరీలు సుదీర్ఘ ప్రాసెసింగ్ సమయం, అదనపు నేపథ్య తనిఖీలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. డాక్యుమెంట్‌లను పునరుద్ధరించడానికి స్వదేశాలకు వెళ్ళిన చాలా మంది వీసాదారులు, అమెరికా కాన్సులేట్‌లు ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌లను రద్దు/జాప్యం వల్ల అక్కడే చిక్కుకుపోయారు.

డిసెంబర్‌లో తమ వర్క్ పర్మిట్‌లను పునరుద్ధరించుకోవడానికి భారత్ కు తిరిగి వచ్చిన వందలాది మంది హెచ్-1బీ వీసా హోల్డర్లు, అమెరికా కాన్సులర్ కార్యాలయాలు అపాయింట్‌మెంట్‌ల వద్ద పడిగాపులు పడుతున్నారు. వీటిని అకస్మాత్తుగా రద్దు చేయడం, రోజుల తరబడి కొత్త తేదీలను కేటాయించడంతో ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారు. కొత్త వీసా పరిశీలన విధానం కారణంగానే ఇంటర్వ్యూ అపాయింట్ మెంట్ తేదీలను సవరించాల్సి వచ్చింది.

Take a Poll

ఈ విధానంలో దరఖాస్తుదారుల సోషల్ మీడియా కార్యకలాపాలు, వారి ఆన్‌లైన్ ఉనికిని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ జాప్యం ఉన్నప్పటికీ.. అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లు హెచ్-1బీ, హెచ్-4 దరఖాస్తులను స్వీకరించడం, ప్రాసెస్ చేయడం కొనసాగిస్తాయని స్టేట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. దరఖాస్తుదారులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+