Super Offer:వ్యాక్సిన్ వేసుకుంటే... నచ్చినవారితో శృంగారం ఫ్రీ: అమెరికా బంపరాఫర్
కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న వేళ అన్ని దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకా వేయించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. భారత్‌లో టీకా పంపిణీ కార్యక్రమం కాస్త మందకొడిగా సాగుతున్నప్పటికీ పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇప్పటికే చాలా వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఇందుకు కారణం ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలే. తాజాగా అగ్రరాజ్యం అమెరికా టీకాకు అర్హులై ఉండి వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనకాడుతున్న వారికి ఓ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ వింతగానే ఉన్నప్పటికీ దీనికి చాలామంది ఆకర్షితులవుతున్నారు.

హాట్ ఆఫర్ ఇచ్చిన అమెరికా
అగ్రరాజ్యం అమెరికా తమ దేశపౌరులందరికీ టీకా వేయించేందుకు వినూత్నమైన ఆలోచన చేసింది. టీకా అర్హులైన ప్రతి ఒక్కరూ తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డేటింగ్ యాప్స్‌తో జతకడుతున్నట్లు వైట్ హౌజ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వేసవి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో కానీ, అబ్బాయిలు అమ్మాయిలతో కానీ శృంగారంలో ఉచితంగా పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అంటే సాధారణంగా డేటింగ్ యాప్స్ పై ఆధారపడి అక్కడి యువతీ యువకులు నచ్చిన వారితో డేట్ చేసి శృంగారంలో పాల్గొంటారు. ఇందుకోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ సరికొత్త నిర్ణయంతో వారు ఉచితంగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే సెక్స్‌లో పాల్గొనొచ్చు.

డేటింగ్ యాప్స్‌తో జతకట్టిన వైట్ హౌజ్
ఇక డేటింగ్ యాప్స్‌పై యూజర్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఆ యూజర్స్ తాము వ్యాక్సిన్ తీసుకున్నామనే విషయాన్ని ప్రొఫైల్‌లో స్పష్టంగా పొందుపరచాల్సి ఉంటుంది. అలా వ్యాక్సిన్ తీసుకున్న వారు టీకా వేయించుకున్న మరొక వ్యక్తితో డబ్బులు చెల్లించకుండానే ఉచితంగా శృంగారంలో పాల్గొనవచ్చు. అమెరికా ప్రభుత్వం డేటింగ్ యాప్స్‌తో జతకట్టడంతో ఆ యాప్స్ ఇప్పుడు కొన్ని ప్రీమియం ఫీచర్లను కూడా ఉచితంగా అందిస్తున్నాయి.
ఇక తాము టీకా వేయించుకున్నామన్న విషయం ధృవీకరిస్తే యాప్‌లోని తమ ప్రొఫైల్‌పై ప్రత్యేకమైన బ్యాడ్జీలు లేదా స్టిక్కర్లను డేటింగ్ యాప్స్ పెడుతున్నాయి. అంతేకాదు ఇలాంటి ప్రొఫైల్స్ ముందుగా కనిపిస్తాయి. దీంతో వ్యాక్సిన్ చేసుకున్న వారితో మాత్రమే డేటింగ్ ఆపై ఉచితంగా సెక్స్‌కు అనుమతి ఉంటుంది. ఇక అదే యాప్‌లో దగ్గరలోని వ్యాక్సినేషన్ సెంటర్లకు సంబంధించి సమాచారం ఉంటుంది.

ఆకట్టుకుంటున్న ఆఫర్
ఇక యాప్‌లపై వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా తెలిపితే వారికి తగిన మ్యాచ్ దొరికే అవకాశాలు 14శాతం ఎక్కువగా ఉంటాయని వైట్ హౌజ్ కోవిడ్ -19 సలహాదారుడు ఆండీ స్లావిట్ చెప్పారు. టీకా కార్యక్రమంను ముందుకు తీసుకెళ్లేందుకు చివరకు ఒక అస్త్రం దొరికిందని అది మెజారిటీ ప్రజలను ఆకట్టుకుంటోందని ఆండీ స్లావిట్ చెప్పారు. ఈ కొత్త ఫీచర్లను అన్ని డేటింగ్ యాప్స్‌లో తీసుకువచ్చేందుకు వైట్ హౌజ్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రస్తుతం అమెరికాలో 38శాతం ప్రజలు పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నారు.
70శాతం జనాభాకు కనీసం ఒక్క డోసు అయినా వేయించాలన్న లక్ష్యంతో వైట్‌హౌజ్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది జూలై 4వ తేదీకల్లా పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకుంది. అందుకే డేటింగ్ యాప్స్‌తో జతకట్టి వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భావిస్తోంది.












Click it and Unblock the Notifications