గన్ కల్చర్: ఆరుగురిని కాల్చి చంపిన సాయుధుడు
చికాగో: అమెరికాలో గన్ కల్చర్‌కు అంతం పలికేట్లు లేరు. అమెరికాలోని టెక్సాస్ హౌస్టన్ శివారులోని స్ప్రింగ్‌లో బుధవారంనాడు ఆగంతకుడు కాల్పులు జరపడంతో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని హరీస్ కౌంట్ షెరీఫ్ కార్యాలయం వెల్లడించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
సాయుధుడి కాల్పుల్లో ఆరుగురు మరణించినట్లు, మృతుల్లో పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏడుగురిపైకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఆరుగురు పెద్దవారు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

కాల్పులు జరిపిన ప్రదేశానికి కొద్ది దూరంలో గన్‌మన్‌గా అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు చుట్టుముట్టినట్లు సమాచారం. రెండు ట్రక్కుల మధ్య ఓ చిన్నకారు ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఇంకా వివరాలు అందాల్సి ఉందని, ఆ తర్వాత దీనికి సంబంధించిన విషయాలు చెబుతామని హరీష్ కౌంటీ షెరీఫ్ అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications