వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్ న్యూస్: US H1B visa రిజిస్ట్రేషన్-2022 ప్రారంభం -ప్రక్రియ పూర్తి వివరాలివే..

|
Google Oneindia TeluguNews

అమెరికాలో ట్రంప్ శకం ముగియడం, కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ గద్దెనెక్కడంతో వలసదారుల్లో ఉత్సాహం నెలకొంది. అమెరికాలో ఉద్యోగాలు చేయగోరేవారికి ఊరట కల్పిస్తూ బైడెన్ సర్కారు కీలక అడుగులు వేసింది. కొత్త హెచ్ 1బీ వీసాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారంతో ప్రారంభమైంది.

Recommended Video

#H1BVisa : H1B Registration For 2022 Has Started, Here Are The Details || Oneindia Telugu

2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఇవాళ్టితో ప్రారంభమైన హెచ్ 1బీ వీసాల నమోదు ప్రక్రియ ఈ నెల 25 వరకు కొనసాగుతుందని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్‌) ప్రకటించింది. కాగా, ఈ ఏడాది కూడా లాటరీ పద్దతిలో వీసాలు జారీ చేయనుంది యూఎస్‌సీఐఎస్. ఇలా వీసాకు ఎంపికైన వారిని యూఎస్‌సీఐఎస్‌ మార్చి 31లోపు సమాచారం చేరవేస్తుంది. వీరు మాత్రమే హెచ్-1బీ క్యాప్ దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది.

మహేశ్ బాబును పెట్టి కోట్లు ఇవ్వలేం -దేత్త‌డి హారికనే అంబాసిడర్ -తొలగింపు వట్టిదే: TSTDC చైర్మన్ క్లారిటీమహేశ్ బాబును పెట్టి కోట్లు ఇవ్వలేం -దేత్త‌డి హారికనే అంబాసిడర్ -తొలగింపు వట్టిదే: TSTDC చైర్మన్ క్లారిటీ

రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా.. 1)మొదట ప్రతి దరఖాస్తుదారుడు యూఎస్‌సీఐఎస్‌ ఖాతా క్రియేట్ చేసుకోవాలి. దీని ద్వారా మాత్రమే హెచ్-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 2)ప్రతి దరఖాస్తుదారుడు రిజిస్ట్రేషన్ ఫీజు కింద 10 డాలర్లు(రూ.729) చెల్లించాల్సి ఉంటుంది. 3)ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కు వర్కర్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారం అవసరం అవుతుంది. 4)ఎంపికైన దరఖాస్తుదారులు మాత్రమే హెచ్-1బీ క్యాప్-సబ్జెక్ట్ పిటిషన్లను దాఖలు చేయడానికి అర్హులు.

US H1B visa Registration For 2022 Has Started: Last Date, How To Apply, Deadlines

ఇక ప్రతి యేటా యూఎస్ వీదేశీయులకు 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. అలాగే మరో 20వేల హెచ్-బీ వీసాలు మాస్టర్ క్యాప్(అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది. ఇలా ప్రతి ఏడాది అగ్రరాజ్యం విదేశీయులకు ఉపాధి కల్పించేందుకు మొత్తం 85వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. అయితే, ప్రతి ఏడాది యూఎస్ ఇచ్చే 85వేల కొత్త హెచ్-1బీ వీసాలలో సుమారు 70 శాతం వీసాలు(దాదాపు 60వేలు) భారతీయులకు జారీ అవుతున్నట్లు సమాచారం.

'అంబానీ బాంబు' కేసులో అనూహ్య మలుపు -పీపీఈ కిట్‌‌ను ఇలా కూడా వాడొచ్చా? -సీసీటీవీలో అనుమానితుడి గుర్తింపు'అంబానీ బాంబు' కేసులో అనూహ్య మలుపు -పీపీఈ కిట్‌‌ను ఇలా కూడా వాడొచ్చా? -సీసీటీవీలో అనుమానితుడి గుర్తింపు

భారత్ తర్వాత అత్యధికంగా హెచ్-1బీ వీసాలు పొందేది డ్రాగన్ కంట్రీ చైనానే. కాగా, విదేశీ నిపుణులు ఈ వీసా ద్వారా అగ్రరాజ్యంలో తాత్కాలికంగా మూడేళ్ల నుంచి ఆరేళ్ల వరకు ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి హెచ్ 1బీ వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఊరట లభించినట్లయింది.

English summary
The United States Citizenship and Immigration Services (USCIS) has started accepting online registrations for the H-1B visa for FY22 from Tuesday, March 9, onwards. It can be noted that the registration window will be open till March 25. Candidates will be selected based on a lottery. The lottery system, however, might be replaced by wage-based selection of petitions from next year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X