ఉక్రెయిన్‌లో బాంబుల మోత : రష్యాకు సాయం చేస్తే తీవ్ర పరిణామలు.. చైనాకు అమెరికా హెచ్చరిక !!
రష్యా బాంబుల మోతతో ఉక్రెయిన్ వణికిపోతోంది. దాడులకు దిగి 25వ రోజు అవుతున్నా పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోవడంతో మాస్కో సేనలు మరింత రెచ్చిపోతున్నాయి. ఒకవైపు ప్రపంచ దేశాల ఆంక్షలు మరోవైపు స్వదేశంలో నిరసన సెగలు తగులున్నా.. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ సైనిక స్థావరాలు, ప్రజల నివాసాలను టార్గెట్ చేస్తూ మరింత రెచ్చిపోతున్నారు. భారీగా బాంబులు, క్షిపణులను ప్రయోగిస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు.

రష్యాకు ఆయుధ సాయంపై నిఘా..
రష్యా దురాక్రమణను కట్టడి చేసేందుకు అమెరికా, యూకే , ఈయూ దేశాలు ప్రయత్నిస్తున్నారు. మాస్కో బలగాలను దీటుగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు ఆయుధ సాయంతో పాటు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. దీంతో రష్యా సేనలను ఉక్రెయిన్ ఆర్మీ సమర్థవంతంగానే ఎదుర్కొంటున్నాయి. కాగా, రష్యాకు ఆయుధ సాయం చేసే దేశాలపై అమెరికా నిఘా పెట్టింది. రష్యాకు చైనా ఆయుధ సాయం అందిస్తుందంటూ వార్తలు రావడంతో ఆమెరికా తీవ్రంగా స్పందించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఘట్టిగానే హెచ్చరించారు.

చైనాకు అమెరికా వార్నింగ్
ఉక్రెయిన్‌పై రెచ్చిపోతున్న రష్యాకు ఆయధ సాయం అందిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని, పర్యావసానాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్ నగరాలను, సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యా విధ్వంసకర దాడులకు పాల్పడుతోందని జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన వీడియో సమావేశ వివరాలను వైట్‌హౌస్ అదికారిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దండయాత్రను నిలువరించేందుకు .. మాస్కోపై విధించిన ఆంక్షలు, చేస్తున్న ప్రయత్నాలను చైనాకు జో బైడన్ వివరించారు.

రష్యా ఆరోపణలకు కౌంటర్
ఈ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో అమెరికా రసాయన, జీవయుద ప్రయోగశాలలను నిర్వహిస్తోందంటూ రష్యా తప్పుడు ప్రచారం చేస్తోందని జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి ముగింపు పలకాలని రష్యాను కోరుతున్నామని స్పష్టం చేశారు. ఇరుదేశాలు ఈ సంక్షోభాన్ని దౌత్యపరంగా పరిష్కరించుకోవలని సూచించారు. ఈ విషయంలో తమ పూర్తి మద్దతు ఉంటుందని స్ఫష్టం చేశారు. ఉక్రెయిన్‌ను అన్ని విధాల ఆదుకునేందుకు అమెరికా సిద్ధంగా ఉందని జో బైడెన్స్ భరోసా ఇచ్చారు. రష్యా దాడులతో ఉక్రెయిన్ కోలుకోని విధంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications