కొత్త కోణం: నిజంగా సాఫ్ట్ వేర్ ఇంజనీరువా? టెకీకి ఎయిర్ పోర్టులో రాత పరీక్ష!
విమానాశ్రయంలో దిగీ దిగగానే అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు ‘నిజంగా నువ్వు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వేనా?’అని ప్రశ్నించారు. అంతటితో వదలకుండా ‘ప్రూవ్ చేసుకో..’ అంటూ ఓ తెల్లకాగితం, కలం ఇచ్చి వారిచ్చిన ప్రశ్నలక
న్యూయార్క్: సాఫ్ట్ వేర్ ఉద్యోగులూ.. బీ అలర్ట్. మంచి మార్కులతో చదువు పూర్తి చేసుకుని.. వివిధ సంస్థలు నిర్వహించే పరీక్షలు, ఇంటర్వ్యూలు ఎదుర్కొని ఎలాగోలా ఉద్యోగం సంపాదించామని ఊపిరి పీల్చుకోకండి.
మీ ప్రిపరేషన్ అక్కడితో అపేస్తే సరిపోదు. ఎందుకంటే విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా మిమ్మల్ని పరీక్షించే ప్రమాదం లేకపోలేదు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇటీవల ఇదే పని చేశారు. సెలెస్టిన్ ఒమిన్ అనే 28 ఏళ్ల నైజీరియన్ కు విమానాశ్రయంలోనే రాత పరీక్ష పెట్టారు. న్యూయార్క్, లాగోస్, నైరోబీలలో కార్యాలయాలు ఉన్న అండెలా అనే ఓ టెక్ స్టార్టప్ కంపెనీలో అతడు పనిచేస్తున్నాడు.
న్యూయార్క్ విమానాశ్రయంలో దిగీ దిగగానే అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు చుట్టుముట్టారు. అతడు తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నని వారికి చెప్పడంతో.. 'నిజంగా నువ్వు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వేనా?'అని ప్రశ్నించారు. అంతటితో వదలకుండా 'ప్రూవ్ చేసుకో..' అంటూ అతడికి ఓ తెల్లకాగితం, కలం ఇచ్చి వారిచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయమన్నారు.
బైనరీ సెర్ఛ్ ట్రీ, అబ్ స్ట్రాక్ట్ క్లాస్ కు సంబంధించిన ప్రశ్నలకు అతడిని సమాధానాలు రాయమని వారు ఆదేశించారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల ఈ ఆకస్మిక పరీక్షకు అతగాడు కంగుతిన్నాడు.

తీరా ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసినా అధికారులు సంతృప్తి చెందలేదంటూ అతడు వాపోయాడు. తనను తిరిగి నైజీరియాకు పంపివేస్తారని భావిస్తున్న తరుణంలో అధికారులు అనూహ్యంగా అనుమతించారని సెలెస్టిన్ వెల్లడించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించిన ఏడు దేశాల జాబితాలో నైజీరియా లేదు.
మరి అక్కడి విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇలా పరీక్షలు ఎందుకు పెడుతున్నారో, వారి ఉద్దేశం ఏమిటో ట్రంప్ కే తెలియాలి. మన దేశం నుంచి కూడా సరైన వీసాపై వెళ్లే వారికి కూడా అక్కడి అధికారులు ఇలాంటి ముందస్తు పరీక్షలు నిర్వహించరన్న గ్యారెంటీ ఏమీ లేదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా!












Click it and Unblock the Notifications