దేవయానికి ఎదురుదెబ్బ: వినతిని తిరస్కరించిన కోర్టు
న్యూయార్క్: తప్పుడు వీసా సమాచారం కేసులో అభియోగాలను నమోదు చేయడానికి జనవరి 13తో గడువు ముగియనుండటంతో ఈ గడువును మరో నెల రోజులు పొడిగించాలని కోరిన భారత దౌత్యవేత్త దేవయాని కోబ్రాగాడె అభ్యర్థనను ఫెడరల్ కోర్టు తిరస్కరించింది. దేవయాని కోబ్రాగాడె కోరిన ప్రకారం గడువు ఇవ్వడం కుదరదని అమెరికాలోని న్యూయార్క్ దక్షిణ జిల్లా మెజిస్ట్రేట్ జడ్జి సారా నెట్‌బర్న్ తన తీర్పులో పేర్కొన్నారు.
ఏదైనా కేసులో నేరారోపణలు ఎదుర్కొన్న వారిపై 30 రోజులలలోగా అభియోగాలు నమోదు చేయడం గానీ, అరెస్ట్ చేయడం గానీ జరుగుతుందని జడ్ఝి తన తీర్పులో వెల్లడించారు. ప్రాథమిక విచారణలో తేదీ వాయిదా అనేది నేరారోపణల నమోదుపై ఎలాంటి ప్రభావం చూపబోదని పేర్కొన్నారు. వాయిదా వేయాలని కోరడానికి ఏదైనా కారణం ఉండవచ్చు గానీ, ప్రాథమిక విచారణను, అభియోగాలు నమోదు చేయడానికి గడువు పొడగించడం కుదరదని ఆమె తెలిపారు.

వీసా ఆరోపణల కింద దేవయాని కోబ్రాగాడె డిసెంబర్ 12, 2013లో అరెస్ట్ చేయబడ్డారు, జనవరి 13న ఆమెపై ఖచ్చితంగా నేరారోపణలు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అభియోగాలను నమోదు చేసేందుకు, ప్రాథమిక విచారణకు గడువును పొడగించలేమని ఆమె తెలిపారు.
నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి ఎలాంటి రక్షణ కల్పించడం జరగదని జడ్జి పేర్కొన్నారు. ఈ తీర్పు నేపథ్యంలో దేవయాని కోబ్రాగాడెపై జనవరి 13 తర్వాత అభియోగాలు నమోదు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా దేవయాని కోబ్రాగాడె తన విజ్ఞప్తిలో ఫిబ్రవరి 12, 2014 వరకు అభియోగాలు నమోదు చేయకూడదని కోరారని ఆమె తరపు న్యాయవాది డేనియల్ అర్చక్ తెలిపారు.












Click it and Unblock the Notifications