తాలిబన్ కీ లీడర్‌కు స్వేచ్ఛను ప్రసాదించిన ట్రంప్
Donald Trump: అమెరికా అధ్యక్షుడు మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. తాలిబాన్ కీలక నాయకుడికి స్వేచ్ఛను ప్రసాదించారు. విముక్తి కల్పించారు. గతంలో ఆయనపై విధించిన క్యాష్ రివార్డును ఎత్తివేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇది అనూహ్య పరిణామంగా భావిస్తోన్నారు.
ఆ తాలిబన్ సీనియర్ నాయకుడు- సిరాజుద్దీన్ హక్కానీ. గతంలో ఆయనపై 10 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది అమెరికా. ఎవరైనా సరే- హక్కానీని పట్టిచ్చినా లేదా సమాచారాన్ని తెలియజేసినా ఈ రివార్డు దక్కించుకోవచ్చని తెలిపింది. తాజాగా ఇప్పుడు దాన్ని ఎత్తివేసింది. తాలిబన్ల చెరలో ఉన్న తమ దేశస్తుడిని విడుదల చేసిన నేపథ్యంలో డొనాల్డ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ హోమ్ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖనీ తెలిపారు. సిరాజుద్దీన్ హక్కానీతో పాటు మరో ఇద్దరు తాలిబన్ నాయకులు అబ్దుల్ అజీజ్ హక్కానీ, యాహ్యా హక్కానీలపైనా విధించిన నగదు రివార్డును తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలువడిన తరువాత కూడా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ సమాచారం అప్‌డేట్ కాలేదు.
2008లో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లోని సెరెనా హోటల్‌లో ఆరుమంది మృతికి ప్రధాన సూత్రధారి.. సిరాజుద్దీన్ హక్కానీ. అప్పట్లో అమెరికా పౌరుడు థోర్ డేవిడ్ హెస్లా కూడా మృతుల్లో ఉన్నారు. ఆ తరువాత అతన్ని హిట్ లిస్ట్‌లో చేర్చింది అమెరికా. అతని ఆచూకీ తెలియజేసిన వారికి 10 మిలియన్ డాలర్ల నగదు బహుమతి ఇస్తామని ఎఫ్‌బీఐ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో రెండు సంవత్సరాలుగా తాలిబాన్ల చెరలో మగ్గుతున్న అమెరికా పౌరుడు జార్జ్ గ్లెజ్మాన్ విడుదల చేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. కిందటి వారమే అతనికి విముక్తి కల్పించినట్లు పేర్కొంది. దీని తరువాత సిరాజుద్దీన్ హక్కానీపై విధించిన నగదు బహుమతిని అమెరికా ఎత్తివేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
65 ఏళ్ల జార్జ్ గ్లెజ్మాన్ ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లినప్పుడు తాలిబాన్లు కిడ్నాప్ చేశారు. అతన్ని విడిపించడానికి డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ప్రత్యేక రాయబారి ఆడమ్ బోహ్లర్‌తో జరిపిన చర్చలు సఫలం కావడంతో జార్జ్ గ్లెజ్మాన్‌ను విడుదల చేయాలని తాలిబన్లు నిర్ణయించారు. ఈ చర్చలకు ఖతార్ మధ్యవర్తిత్వం వహించింది.
-
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!!












Click it and Unblock the Notifications