భారతీయ విద్యార్థులకు అమెరికా ఊహించని షాక్.. ఇక పర్మనెంట్ రెసిడెన్సీ లేనట్టే..!!
అమెరికా వెళ్లాలని చాలా మంది డ్రీమ్ పెట్టుకుంటారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి ఆ తర్వాత గ్రీన్ కార్డ్ సంపాదించి అక్కడే స్థిరపడాలని అనుకుంటారు. అయితే అలాంటి వారికి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే అమెరికా విద్యాసంస్థల్లో చదువు పూర్తి చేసిన తర్వాత ఆ దేశంలో పని చేయాలనుకునే ప్రతి అంతర్జాతీయ విద్యార్థిపై 70 వేల డాలర్లు ఫీజుగా చెల్లించాలని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ఫీజును సంబంధిత విద్య సంస్థలే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన 8 ప్రముఖ ఐటీ కంపెనీలకు ట్రంప్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఈ ఐటీ కంపెనీల శాశ్వత కార్మిక సర్టిఫికేషన్ (PLC) ను సస్పెండు చేస్తున్నట్లు తెలిపింది. వీటిల్లో భారతీయ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో, హెచ్‌సీఎల్ కూడా ఉన్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను అమెరికా లేబర్ సెక్రటరీ కీత్ సోండర్ లింగ్ వెల్లడించారు.
ఈ కంపెనీలపై పలు ఫెడరల్ సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ అంతర్జాతీయ కంపెనీలు విదేశీ ఉద్యోగులకు పర్మనెంట్ రెసిడెన్సీ ని కల్పించేందుకు వ్యవస్థల్ని తప్పుదోవ పట్టించి నిబంధనలను అతిక్రమించాయని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్ పేర్కొంది. అయితే లీగల్ గా అయినా ఇల్లీగల్ గా అయినా అమెరికాలోకి వలసవాదులను కంట్రోల్ చేయడానికి ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.

పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ పోగ్రామ్(PERM) ను యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్ తీసుకొచ్చింది. ఈ పోగ్రామ్ లో భాగంగా సంబంధిత కంపెనీలు విదేశీ ఉద్యోగులను పర్మనెంట్ గ్రీన్ కార్డ్ లో భాగంగా నియమించుకోవచ్చు. అయితే ఈ ప్రక్రియను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయన్న ఆరోపణలపై అమెరికా లేబర్ డిపార్ట్ మెంట్ దృష్టి సారించింది. ఆయా కంపెనీలు భారీ స్థాయిలో పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ పోగ్రామ్ లను పొందాయని.. దానివల్ల స్థానికులకు దక్కాల్సిన లక్షల ఉద్యోగాలు కనుమరుగయ్యాయని అమెరికా లేబర్ డిపార్ట్ మెంట్ అంచనా వేసింది.












Click it and Unblock the Notifications
