ఐసిస్‌లో చేరడానికి ప్రయత్నం, అమెరికన్‌కు 82 నెలలు జైలు శిక్ష
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థలో చేరాలని ప్రయత్నించిన యువకుడికి అమెరికా న్యాయస్థానం జైలు శిక్ష విదించింది. సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చెయ్యాలని ప్రయత్నించే వారికి ఇలాంటి శిక్షపడుతుందని అమెరికా న్యాయస్థానం హెచ్చరించింది.
ఆస్టిన్ నగరంలో మైఖేల్ టోడ్ ఫరూక్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతను ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) తీవ్రవాద సంస్థ కార్యకలాపాలకు ఆకర్షితుడయ్యాడు. వారు చేస్తున్న అరాచకాలు తాను చెయ్యాలని భావించాడు.

2013లో ఎలాగైనా ఐఎస్ఐఎస్ లో చేరాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. చివరికి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు అనుకూలంగా ఉన్న వారితో పరిచయం పెంచుకున్నాడు. ఐఎస్ఐఎస్ తీవ్రాదుల నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో సిరియా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.
టోరాంటో నుండి కెనడా మీదుగా సిరియా వెళ్లడానికి విమానం టికెట్టు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతనిని 2014 జూన్ 17న విమానశ్రయం దగ్గర అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
కోర్టులో విచారణ జరిగింది. మైఖేల్ ఐఎస్ఐఎస్ లో చేరేందుకు వెలుతున్నాడనే సాక్షాలను న్యాయస్థానం పరిశీలించింది. మైఖేల్ కు 82 నెలలు జైలు శిక్ష విదిస్తున్నామని న్యాయస్థానం తీర్పు చెప్పింది.












Click it and Unblock the Notifications