12ఏళ్ల కూతురిపై తండ్రి రేప్ : '60రోజుల జైలు శిక్ష' తో సరిపెట్టిన కోర్టు
హెలినా : 12ఏళ్ల కూతురిపై ఓ 60 ఏళ్ల తండ్రి పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో.. కోర్టు అతనికి కేవలం 60రోజుల జైలు శిక్ష మాత్రమే విధించడం పట్ల సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తీర్పు ఇచ్చిన జడ్డిని నిలదీస్తూ బాధితురాలి కుటుంబంతో పాటు పలువురు న్యాయపోరాటానికి దిగారు.
న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. వారంతా సంతకాల సేకరణ చేపట్టారు. కాగా, ఇప్పటికే 17రోజుల జైలు శిక్షను పూర్తి చేసిన సదరు తండ్రి మరో 43రోజుల పాటు మాత్రమే జైల్లో ఉండనున్నాడు. నిజానికి ఈ కేసులో అతనికి 30ఏళ్ల పాటు జైలు శిక్ష పడాల్సి ఉన్నా.. న్యాయమూర్తి అందుకు విరుద్దంగా తీర్పు వెలువరించడంతో.. తీర్పుపై బాధిత కుటుంబం మండిపడుతోంది.

కాగా, అతని ప్రవర్తనలో మార్పు కోసం అతన్ని రిహబిలేషన్ సెంటర్ కు తరలించి ట్రీట్ మెంట్ అందించాల్సిందిగా న్యాయమూర్తి మెక్ కియోన్ తీర్పు వెలువరించడం గమనార్హం. నిందితుడిలో మార్పు కోసం ఈ అవకాశం ఉపయోగపడుతుందంటూ ఆయన తన తీర్పులో పేర్కొన్నారు. దీంతో తీర్పును వ్యతిరేకిస్తూ న్యాయమూర్తి లేఖరాసిన బాధితురాలి తల్లి.. change.org ద్వారా తీర్పును సవాల్ చేయబోతుంది. ఇందుకోసం 50,000 సంతకాల సేకరణ అవసరం కాగా, గురువారం నాటికి 38,665 మంది సంతకాలు సేకరించారు.












Click it and Unblock the Notifications