అమెరికాలో టోర్నడో విధ్వంసం: పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధింపు: ముగ్గురు దుర్మరణం
USA Tornado: అమెరికాలో శక్తిమంతమైన టోర్నడోలు విధ్వంసం సృష్టించాయి. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ ఏర్పడిన ఈ టోర్నడోల వల్ల పలు రాష్ట్రాలు అల్లకల్లోలానికి గురయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. 23 మంది గాయపడ్డారు.
టోర్నడోల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎమర్జెన్సీని విధించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సన్నద్ధం అయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా ఆసుపత్రుల్లో వార్డులను సిద్ధం చేశారు. విపత్తు నిర్వహణ విభాగం అధికారులను మోహరింపజేశారు. టోర్నోడో అనంతరం అత్యవసర సర్వీసులను పునరుద్ధరించడానికి అవసరమైన మానవ వనరులను అందుబాటులో ఉంచుకున్నారు.

ప్రధానంగా టెన్నెస్సీ, కెంటకీల్లో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. హెండర్సన్‌విల్లె, క్లార్క్స్‌విల్లె, నాష్ విల్లె, మాంట్‌గోమెరి.. వంటి చోట్ల నష్టం తీవ్రత అధికంగా కనిపించింది. టెన్నెస్సీ ఉత్తర ప్రాంతంలో ఓ చిన్నారి సహా ముగ్గురు మరణించినట్లు మాంట్‌గోమెరి పోలీసులు నిర్ధారించారు. 23 మంది గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
🚨#BREAKING: A Tornado Emergency has been issued for a extremely large and violent tornado on the ground
— R A W S A L E R T S (@rawsalerts) December 9, 2023
📌#Hendersonville | #TN
The National Weather Service has issued a tornado emergency for Hendersonville, Gallatin, and Goodlettsville Tennessee. Residents in the area should… pic.twitter.com/NvWCZ2nNaR
అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు నార్త్ టెన్నెస్సీలో టోర్నడో సంభవించింది. ఉరుములు, మెరుపులతో అతి భారీ వర్షాలు కురిశాయి. ఈ టోర్నడోలను అతి తీవ్రమైనవిగా నేషనల్ వెదర్ సర్వీస్ అధికారులు గుర్తించారు. ఈదురుగాలుల తీవ్రత గంటకు 158 నుంచి 206 మైళ్ల వేగంతో నమోదైతే దీన్ని అతీ తీవ్ర టోర్నడోగా భావిస్తారు. నార్త్ టెన్నెస్సీలో ఇప్పుడు అలాంటిదే సంభవించింది.
దీని ప్రభావం టెన్నెస్సీపై పడింది. 82 వేల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు పవర్ అవుటేజ్ డాట్ కామ్ తెలిపింది. స్ప్రింగ్ ఫీల్డ్, క్లార్క్క్‌విల్లె, హెండర్సన్‌విల్లె, కెంటకీల్లో పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించినట్లు పేర్కొంది. మరిన్ని టోర్నడోలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ వెదర్ సర్వీస్ అధికారులు సూచించారు. ఎమర్జెన్సీని విధించారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
బిల్ గేట్స్ వర్షాలను కంట్రోల్ చేస్తున్నారా? 'వార్' ఆన్ వెదర్! -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
ఏడు రోజుల్లోనే ఆరు బ్యాంకుల్లో చోరీ.. కానీ దోచుకుంది మాత్రం..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు












Click it and Unblock the Notifications