Onions virus: కరోనాతో జట్టుపీక్కుంటే కొత్త లొల్లి, ఉల్లిలో కొత్త వైరస్ !, అమెరికా, కెనడాలో బ్యాన్ !
కాలిఫోర్నియా/ కెనడా/ అమెరికా: ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి గడగడలాడిస్తోంది. కరోనా వైరస్ విరుగుడుకు మందు కనిపెట్టాలని శాస్త్రవేత్తలు వారు ఇంత కాలం ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న గడ్డాలు, మీసాలు, జట్టు పీక్కుంటున్నారు. ఇలాంటి సమయంలో కొత్తగా సాల్మొనెల్లా బ్యాక్టీరియా వైరస్ తెర మీదకు వచ్చింది. ప్రతి ఇంట్లో వంటలో ఉపయోగించే ఉల్లిపాయలు (Onions) నుంచి సాల్మొనెల్లా వైరస్ వ్యాపిస్తోందని వెలుగు చూసింది. అప్పటికే అగ్రదేశం అమెరికాతో పాటు కెనడాలో ఉల్లిపాయలను పూర్తిగా నిషేధించడంతో ప్రజలు హడలిపోతున్నారు.
Recommended Video

సాల్మొనెల్లా వైరస్ అంటే ?
సాల్మొనెల్లా బ్యాక్టీరియా వైరస్ అంటే జంతువులకు ఎక్కువగా వ్యాపిస్తుందని సమాచారం. ఈ వైరస్ మనుషుల దేహంలోకి ప్రవేశించిన తరువాత సాల్మొనెల్లా వైరస్ అనిపిలుస్లారు. ఈ సాల్మొనెల్లా వైరస్ మానుషులపై అనేక ప్రభావాలు చూపిస్తుందని వెలుగు చూసింది. సాల్మొనెల్లా వైరస్ మనుషుల్లో రెండు నుంచి ఏడురోజుల మద్యలో తీవ్ర ప్రభావం చూపిస్తోందని వైద్యులు అంటున్నారు.

నెల రోజులు నరకం !
మనుషుల్లోకి ప్రవేశించిన ఈ వైరస్ చెడు ప్రభావం చూపిస్తుందని, వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని కొందరు వైద్యులు అంటున్నారు. మానవుల్లోకి సాల్మొనెల్లా వైరస్ చేరిన తరువాత నెలల పాటు వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతుందని, మనుషుల రక్తంలో ఈ వైరస్ చేరిపోతుందని, వెంట్రుకల మీద తీవ్రప్రభావం చూపిస్తుందని అమెరికా, కెనడాకు చెందిన వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వైరస్ లక్షణాలు ఇవే
సాల్మొనెల్లా వైరస్ సోకిన రోగులకు వాంతులు, విరేచనాలు అవుతాయని, రక్త సరఫరా దెబ్బ తింటుందని, ముఖ్యంగా మానవుడి వెంట్రుకల మీద తీవ్రప్రభావం చూపిస్తుందని అమెరికా, కెనడాకు చెందిన వైద్యులు చెబుతున్నారు. సాల్మొనెల్లా వైరస్ వ్యాధి లక్షణాలు మనుషుల్లో రెండు రోజుల నుంచి 7 రోజుల్లోపు తీవ్రప్రభావం చూపిస్తుందని అమెరికా, కెనడా వైద్యులు అంటున్నారు.

అమెరికా, కెనడాలో Onions బ్యాన్
ఉల్లిపాయలు ( Onions) నుంచి సాల్మొనెల్లా వైరస్ ఎక్కువ వ్యాపిస్తుందని గుర్తించిన ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాతో పాటు కెనడాలో ఇప్పటికే ఉల్లిపాయలపై నిషేధం విదించారు. ముఖ్యంగా కాలిఫోర్నియా నుంచి ఎగుమతి చేసుకున్న ఉల్లిపాయులు ఎవ్వరూ తినకూడదని, వాటిని కొనులుగోలు చెయ్యరాదని, ఆ ఉల్లిపాయలు విక్రయించరాదని అమెరికా, కెనడా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఉల్లిపాయలు, నీళ్లతో జాగ్రత్త !
సాల్మొనెల్లా వైరస్ ఉల్లిపాయలతో పాటు నీళ్లతో కూడా మనం సేవించి ఆహారంలో శరీరంలోకి చేరే అవకాశం ఉందని అమెరికా ఆహార, ఔషదాల సరఫరా శాఖ అధికారులు ప్రజలను హెచ్చరించారు. మే నెల నుంచి కాలిఫోర్నియా నుంచి ఎగుమతి చేసుకున్న ఉల్లిపాయులు ఎవర్వూ తినకూడదని అమెరికా ప్రభుత్వం అక్కడి ప్రజలను హెచ్చరించింది.

ఇప్పటికే కరోనా, ఇప్పుడు ఉల్లినా ?
సాల్మొనెల్లా వైరస్ వ్యాధి ప్రభావం పిల్లల మీద, వయసు తక్కువ ఉన్న వాళ్ల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న ప్రజల నెత్తిన ఉల్లిపాయల రూపంలో మరో కొత్త వైరస్ పిడుగు పడినట్లు అయ్యిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications