పైలట్‌కి నచ్చలేదని భారతీయుడ్ని విమానం దించేశారు
న్యూయార్క్: పైలట్‌కు నచ్చలేదని ఓ సిక్కును, అతని స్నేహితులైన ముగ్గురు ముస్లింలను విమానం నుంచి దించేశారు. దీన్ని అవమానంగా భావించిన వారు విమాన సిబ్బందిపై 9 మిలియన్‌డాలర్లకు పరువు నష్టం కేసు పెట్టారు. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది.
డిసెంబర్ నెలలో అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం టొరంటో నుంచి న్యూయార్క్ వెళ్లాల్సి ఉంది. ప్రయాణికుల్లో ఒక సిక్కుతో పాటు బంగ్లాదేశ్, అరబ్‌కి చెందిన ముగ్గురు ముస్లింలు ఉన్నారు.

విమానం ఎక్కగానే సిక్కు ప్రయాణికుడు తన స్నేహితుడైన ముస్లిం ప్రయాణికులతో కూర్చుందామనుకుని తోటి ప్రయాణికులని రిక్వెస్ట్ చేసి సీటు మార్పించుకుని కూర్చున్నారు. అయితే, కొద్ది సేపటి తర్వాత ఎయిర్‌హోస్టెస్ వచ్చి నలుగురినీ కిందకి దిగమంది.
ఎందుకు అని అడిగితే మర్యాదగా దిగి గేట్ వద్ద వెయిట్ చేస్తే ఆ తర్వాత ఏం చేయాలో సిబ్బందే చెప్తారంటూ కాస్త కఠినంగా మాట్లాడింది. వారి జాతి, రంగు ఏమాత్రం పైలట్‌కి, విమాన సిబ్బందికి నచ్చలేదని అందుకే దింపేసినట్లు తెలిసింది. దీంతో ఈ విషయమై నలుగురు ప్రయాణికులూ కలిసి ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై బుధవారం కోర్టులో 9 మిలియన్ డాలర్లకు దావా వేశారు.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ












Click it and Unblock the Notifications