కేరట్లలో అమెరికాకు కు డ్రగ్స్ సరఫరా

న్యూయార్క్: మత్తు పదార్థాల రవాణాకు స్మగ్లర్లు అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు. రోజుకు ఒక కొత్త ప్లాన్ వేస్తూ డ్రగ్ మాఫియా మత్తు పదార్థాలను గమ్యం చేర్చడానికి నానా తంటాలు పడుతున్నారు. అయితే వారిని పట్టుకోవడానికి పోలీసులు సైతం శక్తి వంచనలేకుండా పని చేస్తున్నారు.

మెక్సికోలోని డ్రగ్ మాఫియా మాత్రం పోలీసులను మోసం చెయ్యడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నించి చివరికి చిక్కిపోయారు. డ్రగ్ మాఫియా ముఠా సభ్యులు కేరట్ లాంటి కృత్రిమ కేరట్లు సృష్టించారు. వాటిల్లో డ్రగ్స్ దాచి పెట్టారు.

తరువాత నిజమైన కేరట్ల మధ్య భాగంలో డ్రగ్స్ దాచి పెట్టిన కృత్రిమ కేరట్లు పెట్టారు. ఇలా డ్రగ్స్ ను గమ్యం చేర్చడానికి విఫలయత్నం చేశారు. డ్రగ్స్ దాచి పెట్టిన దాదాపు మూడువేల కృత్రిమ కేరట్లను నిజమైన క్యారెట్ల మధ్య దాచి పెట్టారు.

US Police say that nearly 3,000 packages were mixed in with real carrots

వాటిని అమెరికాలోని టెక్సాస్ కు తరలించడానికి ప్రయత్నించారు. అయితే టెక్సాస్-మెక్సికో సరిహద్దులో ఆ ట్రక్కులను పోలీసు అధికారులు తనిఖీ చేశారు. అనుమానం రావడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఆ కేరట్లలో దాదాపు రూ. 3.5 కోట్ల విలువైన (ఐదు లక్షల డాలర్లు) డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని దర్యాప్తు చేస్తున్న అధికారి ఈఫ్రెయిన్ తెలిపారు. మెక్సికో-అమెరికాల మధ్య మరో సారి డ్రగ్స్ సరఫరా చెయ్యడానికి మాఫియా ముఠా సభ్యులు ప్రయత్నించారని అధికారులు అన్నారు.

అయితే వారి ప్రయత్నాలను తాము తిప్పి కొడుతున్నామని, అమెరికాలోకి డ్రగ్స్ సరఫరా కాకుండా అడ్డుకుంటామని టెక్సాస్ పోలీసు అధికారులు చెప్పారు. గతంలో షూ, సాక్స్ లు, ఎలక్ట్రానిక్ వస్తువుల్లో డ్రగ్స్ సరఫరా చెయ్యడానికి ప్రయత్నించేవారు. అయితే ఇప్పుడు సరికొత్త పద్దతులు ఫాలో అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+