Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

న్యూడ్ ఫోటో: భార్యలపై అసభ్యంగా ట్రంప్-క్రూజ్(ఫోటో)

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ తరఫున పోడీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, టెడ్ క్రూజ్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వారి మాటల యుద్ధం.. ఒకరి భార్యను మరొకరు విమర్శించే స్థాయికి కూడా పోయింది.

టెడ్ క్రూజ్ భార్య హైదీ క్రూజ్ చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ట్రంప్.. 'స్పిల్ దీ బీన్స్' (అందాలను మరింతగా బయటకు తీయాలి అనే అర్ధం వచ్చేలా) అంటూ ట్యాగ్‌లైన్ పెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి రీట్వీట్ చేసిన క్రూజ్ తనదైన శైలిలో స్పందించాడు.

ట్రంప్ భార్య, మోడల్ మెలనియా న్యూడ్ చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. 'నో నీడ్ టు స్పిల్ ది బీన్స్' (అందాలను ఇంకా బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు) అని కామెంట్ చేశారు. ఈ రెండు చిత్రాలూ వెయ్యి పదాల విమర్శలకు సమానమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

US polls 2016: After Trump's penis size, talks are now on his wife's nude photo

అసలు తన భార్యను ఎందుకు ఇలా లాగుతున్నారని, ఆమెను వదిలివేయాలని క్రూజ్ నిప్పులు చెరిగారు. వీరి ప్రచారం వ్యక్తిగత విమర్శలకు దారితీయడం, అందునా భార్యలను భాగం చేస్తూ, ఇలా అసభ్య పదజాలం, ఇబ్బందికర చిత్రాలను ప్రచారానికి వాడటం సరికాదని చాలామంది భావిస్తున్నారు.

అంతకుముందు కూడా 'మీట్ మెలెనియా ట్రంప్, యువర్ నెక్స్ట్ ఫస్ట్ లేడీ' (ఈమె మెలనియా ట్రంప్‌. నెక్స్ట్ ఫస్ట్ లేడీ) అని కూడా ఓ పోస్ట్ పెట్టారు. వీరి భార్యల గొడవపై సామాజిక అనుసంధాన వేదికలలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+