ఐఎస్ఐఎస్ అంతం: ఒబామా, హోలాండ్ భేటి
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) అంతం చూడటానికి అమెరికా, ఫ్రాన్స్ దేశాలు సిద్దం అవుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని అంతం చెయ్యడానికి తమతో కలిసి రావాలని అమెరికా ఫ్రాన్స్ ను ఆహ్వానించింది.
ఇప్పటికే ప్యారిస్ దాడులతో ఫ్రాన్స్, వైట్ హౌస్ ను పేల్చేస్తామని బెదిరించడంతో అమెరికా, ఫ్రాన్స్ దేశాలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదల మీద రగిలిపోతున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇద్దరూ భేటి కావడానికి వైట్ హౌస్ లో అన్ని ఏర్పాట్లు చేశారు.

హోలాండ్ ను వైట్ హౌస్ కు రావాలని బరాక్ ఒబామా స్వయంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ కూడా హాజరుకానున్నారు. ప్యారిస్ లో ఉగ్రవాదులు జరిపిన దాడులకు సంబంధించి ఫ్రాన్స్ జరుపుతున్న దర్యాప్తు ఎంత వరకు వచ్చింది అని చర్చించనున్నారు.
అంతే కాకుండా ఫ్రాన్స్ దర్యాప్తుకు అమెరికా సహాయం చెయ్యాలనే అంశం మీద చర్చ జరగనుంది. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై అమెరికా, ఫ్రాన్స్ సంయుక్తంగా దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం.
వైట్ హౌస్ లోని ఓవల్ కార్యాలయంలో బరాక్ ఒబామా, ఫ్రాన్స్ అధ్యక్షుడు హౌలాండ్ భేటి కావడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అధికారులు తెలిపారు. ఇరు దేశాల అధినేతలు చర్చించిన తరువాత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారు అని వేచిచూడాలి.












Click it and Unblock the Notifications