యూ ఆర్ బ్యూటిఫుల్.. అందరి ముందే ఆమెపై ట్రంప్‌ షాకింగ్ కామెంట్స్ !!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతున్నాయి. ఈజిప్టు వేదికగా జరిగిన గాజా శాంతి శిఖరాగ్ర సమావేశంలో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనిపై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. "మీరు అందంగా ఉన్నారు, అనడానికి అభ్యంతరం లేదు కదా?" అంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో సైతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

కాగా ఈ శాంతి సదస్సుకు ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో పాటు 20 దేశాల అధినేతలు హాజరయ్యారు. అయితే ఈ సదస్సుకు వెళ్తే ట్రంప్, షరీఫ్ లతో వేదిక పంచుకోవాల్సి వస్తుందనే కారణంతో భారత ప్రధాని మోడీ దూరంగా ఉండిపోయారు. అయితే దేశాధినేతలు, ప్రపంచ ప్రముఖుల సమక్షంలో అందరి ముందే ట్రంప్.. మెలోనిని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.

us-president-donald-trump-comments-on-giorgia-meloni

ట్రంప్ ఏమన్నారంటే..

యునైటెడ్ స్టేట్స్‌లో ఒక మహిళ గురించి 'అందమైన' అనే పదాన్ని ఉపయోగిస్తే అది నా రాజకీయ జీవితానికి ముగింపు కావచ్చు. నాకు అలా మాట్లాడే అవకాశం లేదు, కానీ ఈ అవకాశాన్ని నేను తీసుకుంటున్నాను. మిమ్మల్ని అందంగా ఉన్నారని పిలవడానికి మీకు అభ్యంతరం లేదు కదా? ఎందుకంటే మీరు నిజంగా అందంగానే ఉన్నారు." ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలకు మెలోని సహా వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో మెలోని ఒక్కరే మహిళా నాయకురాలు కావడం విశేషం.

అంతే కాకుండా ట్రంప్ జార్జియా నాయకత్వ సామర్థ్యాన్ని కూడా కొనియాడారు. మెలోని అద్భుతమైన నాయకురాలు అని కితాబిచ్చారు. ఇటలీ ప్రజలంతా మెలోనిని గౌరవిస్తారు, ఎందుకంటే ఆమె విజయవంతమైన రాజకీయ నాయకురాలు అన్నారు.

మరోవైపు ఈ సదస్సులో మరో ఆసక్తికర సంఘటన కూడా చోటు చేసుకుంది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రసంగం మొదలు పెట్టగానే.. ఆద్యంతం డొనాల్డ్ ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ట్రంప్‌ను "ప్రపంచ శాంతికర్త"గా అభివర్ణించారు. మీరు గతంలో భారతదేశం-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపారు. ఇప్పుడు గాజా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని కూడా ఆపగలరు. ప్రపంచంలో అనేక యుద్ధాలని ఆపారు" అంటూ షరీఫ్ ప్రసంగించారు. కానీ అదే వేదికపై షెహబాజ్ షరీఫ్ ముందే ట్రంప్ అక్కడ లేని భారత ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. దీంతో పాక్ ప్రధాని షరీఫ్ షాక్ కి గురయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+