అబ్బబ్బా.. ఆమె లాంటి బ్యాక్ నా జీవితంలో చూడలేదు.. ట్రంప్ వివాదాస్పద కామెంట్స్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా మిచిగాన్‌లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారితీశాయి. సభలో స్టేజ్ పైనుంచి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలకు గురవుతున్నాయి.

రేపే యుద్ధం?: ఓటు వేయగానే తేల్చేసిన ట్రంప్
రేపే యుద్ధం?: ఓటు వేయగానే తేల్చేసిన ట్రంప్

ఈ ప్రచార సభకు ప్రముఖ అమెరికన్ ర్యాపర్ నికీ మినాజ్ కూడా హాజరయ్యారు. ఆమె ప్రేక్షకుల్లో కూర్చుని ఉండగా.. డొనాల్డ్ ట్రంప్ ఆమె శరీరాకృతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. "ఆమె రూపం నుంచి కళ్లు పక్కకు తిప్పుకోవడం కష్టం" అంటూ పేర్కొన్న ట్రంప్.. అనంతరం నికీ మినాజ్‌ను లేచి నిలబడాలని కోరారు. డొనాల్డ్ ట్రంప్ మాటలకు అక్కడ ఉన్న జనం ఈలలు, చప్పట్లతో స్పందించగా.. నికీ మినాజ్ నవ్వుతూ లేచి నిలబడి తిరిగి కూర్చున్నారు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ పరిస్థితిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తూ.. "నికీ ఈ కామెంట్లకు మనస్తాపం చెందలేదని భావిస్తున్నాను. మేము నికీ మినాజ్‌ను ఎంతో అభిమానిస్తాం, ఆమె చాలా కాలంగా మాకు మద్దతుగా ఉన్నారు" అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

US President Donald Trump Controversial Comments On Nicki Minaj At Michigan Election Rally Details

అయితే అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ఇలాంటి కామెంట్స్ చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వర్ణవివక్ష వంటి తీవ్ర సమస్యలు పీడిస్తుంటే.. ఓ దేశాధ్యక్షుడు వేదికలపై ఇలా మాట్లాడటం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "ఈ కామెంట్స్ దేశానికి సిగ్గుచేటు" అంటూ పలువురు సోషల్ మీడియా వినియోగదారులు విమర్శలు గుప్పిస్తున్నారు.

హార్మూజ్ లో టెన్షన్.. టెన్షన్.. ఏడు ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం..
హార్మూజ్ లో టెన్షన్.. టెన్షన్.. ఏడు ఆయిల్ ట్యాంకర్లు ధ్వంసం..

ఇదిలా ఉండగా.. నికీ మినాజ్ డొనాల్డ్ ట్రంప్‌కు ఎక్కువగా మద్దతు ఇచ్చేవారిలో ఒకరు. గత అధ్యక్షుడు ఎన్నికల సమయంలోనూ ఆమె డొనాల్డ్ ట్రంప్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించడమే కాకుండా.. ఆయన పాల్గొన్న పలు సభలలో వేదికను పంచుకున్నారు. తనను తాను డొనాల్డ్ ట్రంప్ 'నెంబర్ వన్ ఫ్యాన్'గా చెప్పుకున్న నికీ మినాజ్.. ఆయన చేసిన పలు వివాదాస్పద కామెంట్లను కూడా సమర్థించడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+